చేలేశ్వర ఆలయాన్నికి త్వరలో మహా కుంభాభిషేకం పనులు ప్రారంభిస్తాం శ్రీకాళహస్తి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు పరిశీలన
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయం పురాతన శివాలయం చేలేశ్వర ఆలయాన్ని శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, పాలకమండ సభ్యులు పరిశీలన చేశారు. ఆలయానికి త్వరలో మహా కుంభాభిషేకం నిర్వహిస్తామని చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు వెల్లడించారు.
శ్రీకాళహస్తిలో పాన గల్ వద్ద వెలిసి ఉన్న శ్రీ చల్లేశ్వర ఆలయ మహా కుంభాభిషేకం నిర్వహించి 24 ఏళ్ల అవుతున్న సందర్భంగా ఆలయాన్ని దేవస్థానం చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, సోమవారం పరిశీలించారు. పురాతనమైన ఈ ఆలయంలో ఆది కాలం నుంచి పూజలు జరిగేవని, నాటి చెంచులు ఇక్కడ పూజలు నిర్వహించే వారిని విశిష్టమైన ఈ ఆలయాన్ని మళ్ళీ కుంభాభిషేకం నిర్వహించి, భక్తులు మరిన్ని సౌకర్యాలు కల్పించే విధంగా చర్యలు చేపడతామని ఆలయ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు తెలిపారు. ఆలయం లో ఉన్న ఆదిశంకరాచార్యుల విగ్రహాన్ని తీసుకువెళ్లి శ్రీకాళహస్తి ఆలయ ప్రాంగణంలోని బ్రహ్మగుడి వద్ద ప్రతిష్టించి నిత్య పూజలు జరిగేలా చేస్తామని పేర్కొన్నారు. ఈ ఆలయంలో చంద్రుని విగ్రహం ఉండడం, కాల భైరవుడు విగ్రహం కూడా ఉన్నట్లు విశిష్టమైన ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా చర్యలు చేపడతామన్నారు. ఆలయానికి శ్రీకాళహస్తి రెవెన్యూ డివిజన్ ఆర్డీవో రామారావు గారు దర్శనానికి విచ్చేశారు ధర్మకర్తల మండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారు తీర్థ ప్రసాదాలు అందజేశారు
ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండల సభ్యులు జయ శ్యామ్, మున్నా మరియు ఆలయ అర్చకులు శ్రీ దర్భ సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment