*MGM హాస్పిటల్స్, కోకా కోలా వారి ఆధ్వర్యంలో, కాపుగున్నేరి గ్రామంలో ఉచిత మెడికల్ క్యాంపు.*
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తి MGM హాస్పిటల్స్ వారు కోకా కోలా ప్రైవేట్ లిమిటెడ్ వారు సంయుక్తంగా కాపుగున్నేరి గ్రామంలో నిర్వహించిన ఉచిత మెగా మెడికల్ క్యాంపు విజయవంతమైంది. ఈ క్యాంపు కి దాదాపు 200 మంది హాజరై వారి ఆరోగ్య సంబంధించిన సలహాలు తీసుకున్నారు. వారికి MGM హాస్పిటల్స్ డాక్టర్స్ ఉచితం గా అన్ని పరీక్షలు చేశారు. మరియు అవసరమగు మందులు కూడా ఉచితంగా పంపిణీ చేశారు. హాస్పిటల్స్ డైరెక్టర్ గుడ్లూరు మయూర్ మాట్లాడుతూ కోకా కోలా బేవరేజెస్ వారి సహకారం తో గతంలో కూడా పలు గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించామని శ్రీకాళహస్తి పరిసర గ్రామ ప్రజల ఆరోగ్య శ్రేయస్సును కోరి ఈ వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తామని తెలిపారు. వైద్య శిబిరాలే కాకుండా మా MGM హాస్పిటల్స్ నందు 24 గంటలు డాక్టర్ లు మరియు అత్యవసర సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. కోకా కోలా సిబ్బంది దగ్గరుండి అన్ని వసతులు పర్యవేక్షించారు. కాపుగున్నేరి గ్రామ సర్పంచ్ శ్రీమతి సి. స్వప్న గారు మాట్లాడుతూ మా గ్రామంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించిన MGM హాస్పిటల్స్ మరియు కోకా కోలా వారికి కృతఙ్ఞతలు తెలిపారు. ఈ వైద్య శిబిరంలో MGM హాస్పిటల్స్ *డాక్టర్స్ , హాస్పిటల్స్ సిబ్బంది పాల్గొన్నారు.
No comments:
Post a Comment