శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఘనంగా పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు.
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా ఈరోజు శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్చార్జి శ్రీమతి వినుత కోటా ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి పట్టణం ఆర్టీసీ బస్టాండ్ నందు నాయకులు, కార్యకర్తలు భారీ కేక్ కటింగ్ చెయ్యడం జరిగింది. అనంతరం ఆర్టీసీ బస్టాండ్ నుండి VMC సర్కిల్ మీదుగా నాలుగు మాడ వీధులు మీదుగా స్వామి రిలాక్స్ ప్యారడైజ్ హోటల్ వరకు 2 కి.మీ పవన్ కళ్యాణ్ నినాదాలతో బారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. అనంతరం అవయవదాన (ORGAN DONATION CAMP) కార్యక్రమం భారతదేశంలో ప్రక్యాతిగాంచిన మోహన్ ఫౌండేషన్ ద్వారా నిర్వహించడం జరిగింది. నియోజకవర్గ నాయకులు, జనసైనికులు 100 మంది అవయవదాననికి ముందుకు వచ్చి డోనార్ కార్డ్ ద్వారా అనుమతిని తెలపడం జరిగింది. అనంతరం నా సేన కోసం నా వంతు కార్యక్రమంలో భాగంగా నాయకులు, జనసైనికులు పార్టీకి విరాళం అందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు దండి రాఘవయ్య, ఏర్పేడు మండల అధ్యక్షులు కిరణ్ కుమార్, తొట్టంబేడు మండల అధ్యక్షులు కొప్పాల గోపి బారీ ఎత్తున నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment