శ్రీకాళహస్తీశ్వర ఆలయం లో పవిత్రోత్సవాలు శాస్త్ర యుక్తంగా జరుగుతున్నాయి. యాగశాలలో పూజలు జరిపి ప్రాయశ్చ్చితా ఉపచార పూజలు జరిపారు.
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తి ఆలయంలో పవిత్ర ఉత్సవాల్లో నాల్గవ రోజు యాగశాల నందు ప్రత్యేక పూజలు చేపట్టారు. ఆలయ ప్రధాన అర్చకులు స్వామినాథన్ ఆధ్వర్యంలో విశేష పూజలు జరిపి పూర్ణ హారతులు సమర్పించారు. అనంతరం స్థానికM.L.A మధుసూదన్ రెడ్డి, శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు ఆధ్వర్యంలో పూజా ద్రవ్యాలను ఆలయంలో ఊరేగింపుగా తీసుకువెళ్లి ప్రదక్షిణలు నిర్వహించి, ఆయా దేవత మూర్తుల వద్ద విశేష పూజలు జరిపారు. నిత్య పూజలో జరిగే దోషాలను నివారిస్తూ ఉపచార పూజలను సంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు.కర్పూర హారతులు సమర్పించారు. ఆలయ ప్రాంగణమంతా హర హర మహాదేవ శంభో శంకర నమశ్శివాయ నామస్మరణతో మారు మోగింది. ఈ కార్యక్రమంలో బోర్డు సభ్యులు సాధన మున్న రాయల్, బుల్లెట్ జయశ్యామ్,పెద్దిరెడ్డి మల్లికార్జున్ రెడ్డి,పసాల సుమతి, కొండూరు సునీత, రమాప్రభ, లక్ష్మి, ప్రత్యేక ఆహ్వానితులుజూలకంటి సుబ్బారావు, చింతామణి పాండు, పవన్ కుమార్, పాలమంగం నీలా, శ్రీదేవి, మీనాక్షి అధికారులు ఏసి మల్లికార్జున్ టెంపుల్ సూపర్డెంట్ అయ్యన్న, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు రెడ్డి ఆలయ అర్చకులు, వేద పండితులు తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment