శ్రీశ్రీశ్రీ చాముండేశ్వరి దేవి ఆలయము నందు ప్రత్యేక పూజలు పాల్గొన్న అంజూరు తారక శ్రీనివాసులు
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానమునకు ఈశాన్య దిక్కున భాస్కర్ పేట నందు వెలిసియున్న శ్రీశ్రీశ్రీ చాముండేశ్వరి దేవి ఆలయము నందు దసరా నవరాత్రుల మహోత్సవముల సందర్భంగా అమ్మవారిని భవానీ దేవి అలంకరణతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమమునకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు గారిని ఆలయ కమిటీ వారైనా పులి రామచంద్ర, చల్లా గోవిందు, కటికాల రమేష్, కందాడ రవి, పులి మోహన్ రావు, చల్లా వెంకటేశ్వర్లు, పీఎం చంద్ర, కన్నా నాగయ్య, కన్నా వీరయ్య తదితరులు ఘనంగా స్వాగతం పలికారు. ఆలయ అర్చకులచే అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి హారతిని వారికి అందజేశారు. అనంతరం అమ్మవారి వద్ద ఉంచిన వస్త్రముతో చైర్మన్ అంజూరు శ్రీనివాసులుని సత్కరించి అమ్మవారి కృపాకటాక్షములతో పాటు తీర్థప్రసాదాలను అందజేశారు.
ఈ సందర్భంగా చైర్మన్ అంజూరు శ్రీనివాసులు మాట్లాడుతూ శ్రీ చాముండేశ్వరి దేవి ఆలయం నందు దసరా నవరాత్రుల సందర్భంగా ఆలయం అంతా విద్యుత్ దీపాలంకరణతో మరియు పూల అలంకరణలతో అద్భుతంగా అలంకరించి ఉన్నారని పది రోజులపాటు నవరాత్రులలో ప్రతిరోజూ ప్రత్యేక రూపాఅలంకరణలతో అమ్మవారికి నిర్వహించే పూజా కార్యక్రమాలుకు భక్తులందరూ విచ్చేసి అమ్మవారిని దర్శించి వారి కృపాకటాక్షాలు పొందాలని, అలాగే ఆలయ నిర్వాహకులైన అందరికీ శ్రీ చాముండేశ్వరి దేవి అమ్మవారి ఆశీస్సులతో పాటు తల్లి జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయు లింగేశ్వరుని యొక్క చల్లని దీవెనలు కూడా ఎల్లప్పుడూ తోడు ఉంటాయని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మొగరాల గణేష్, బాల గౌడ్, సనీల్,ప్రసాద్ మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment