మరుపురాని మహానేత డాక్టర్ వైయస్సార్ ... మిద్దెల హరి - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, September 2, 2022

మరుపురాని మహానేత డాక్టర్ వైయస్సార్ ... మిద్దెల హరి

 మరుపురాని మహానేత  డాక్టర్ వైయస్సార్ ... మిద్దెల హరి





 స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :


     దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి గారి వర్ధంతి సందర్భంగా  శ్రీకాళహస్తి టౌన్  డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సర్కిల్  RTC బస్టాండ్ నందు తిరుపతి జిల్లా వైఎస్ఆర్సిపి బీసీ సెల్ అధ్యక్షులు, మాజీ ఆప్కో డైరెక్టర్ ,మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మిద్దెల హరి గారి ఆధ్వర్యంలో  YSR చిత్రపటానికి  పూలమాలవేసి  నివాళులర్పించడం జరిగింది అనంతరం పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు 

    మిద్దెల హరి మాట్లాడుతూ 

ఒక మహా మనిషి భారత దేశమే కాదు  ఆంధ్ర రాష్ట్రమే కాదు ప్రపంచమే గర్వించదగ్గ వ్యక్తి,  గుర్తింపు పొందిన వ్యక్తిగా ప్రజాదరణ పొందారు అలాంటి మహా నేత మనకు దూరమై 13 సంవత్సరాలు అయినా కూడా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా  నిలిచిపోయారన్నారు, ఆ మహానేత  ముఖ్యమంత్రిగా ఉన్న పరిపాలన  స్వర్ణ యుగము ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు, దళిత గిరిజన వర్గాలకు,మైనార్టీలకు,మహిళలకు, విద్యార్థులందరికీ గుర్తించుకునే విధంగా ఆయన్ని స్మరించుకునే విధంగా  అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినందువల్ల ప్రజల గుండెల్లో  దేవుడిగా ముద్ర పడిన విషయాన్ని ఆయన వర్ధంతి సందర్భంగా  గుర్తు చేసుకున్నారు, అలాంటి మహానేత కొడుకు వైయస్ జగన్మోహన్ రెడ్డి తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ  పేద ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు  చేపడుతున్నారు, రాబోయే రోజుల్లో కూడా  మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపడతారని  తెలియజేశారు

ఈ కార్యక్రమంలో  EX కౌన్సిలర్ జయదేవన్ గిరి, తీగల చంద్ర,ముని లక్ష్మి, కిరణ్మయి, గంజి వెంకటేష్, ఇసుక మట్ల బాల, దావాల గిరి, బొజ్జ ప్రభాకర్, చల్లా సుధాకర్, N.సుధాకర్, చెన్నయ్య, రాఘవులు,శేఖరు, జగ్గు,D. శివ,N. వెంకటేష్, A రవీంద్ర,D.బాబు, A కుమార్,, సాయి, శివ, సూరి తదితరులు పాల్గొన్నారు .....

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad