శ్రీకాళహస్తీశ్వరాలయ అనుబంధాలయమైన కనకచలం పై వెలసివున్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి అంకురార్పణ
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తీశ్వరాలయ అనుబంధాలయమైన కనకచలం పై వెలసివున్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి మహా కుంభాభిషేకనికి అంకురార్పణ పూజలు శాస్త్ర యుక్తంగా చేపట్టారు. ఈనెల 5వ తేదీన మహా కుంభాభిషేకం వే దొ యుక్తంగా నిర్వహించనున్నారు.
శ్రీకాళహస్తి దేవస్థానం అనుబంధం ఆలయమైన కనకాచలం కొండపై వెలసి ఉన్న శ్రీ దుర్గా మాత ఆలయకు స్వామినాథ గురుకుల్ ఆధ్వర్యంలో మహా కుంభాభిషేకం శాస్త్ర యుక్తంగా ప్రారంభించారు. శ్రీకాళహస్తి దేవస్థానం చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు పాల్గొన్నారు. శనివారం సాయంత్రం ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్తాపన పూజలు జరిపి అంకురార్పణ పూజలను చేపట్టారు. మూడు రోజులపాటు మహా కుంభాభిషేక పూజలు నిర్వహించనున్నారు. ఈనెల 5వ తేదీన మహా కుంభాభిషేకం నిర్వహించి, శిఖర కలశ ప్రతిష్ట, మూలవిరాట్ ప్రతిష్ట కార్యక్రమాలు జరపనున్నారు. ఈ పూజాది కార్యక్రమాల్లో దేవస్థానం చైర్మన్ అంజూరు శ్రీనివాసులు, ధర్మకర్తల మండలి సభ్యులు, జెల్లీ కృష్ణయ్య. ప్రత్యేక ఆహ్వానితులు చింతామణి పండు, ఆలయ అభిషేకం గురుకుల్ నిరంజన్ ఉప ప్రధాన అర్చకులు కరుణ గురుకుల్, వేద పండితుల అర్ధగిరి, గోవిందు, అర్చకులు తులసి, రాకేష్ శర్మ, అధికారులు అధికారులు దుర్గ, సప్తి కుమార్ మరియు ఎంపీ సిల్క్స్ వెంకట సుబ్బయ్య, బాల, సునీల్, తేజు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment