వృతుల్లో కెల్లా ఉపాధ్యాయ వృత్తి ఎంతో గొప్పది
గురుపూజోత్సవం
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
గురుపూజోత్సవo సందర్బంగా ఉషోదయ ఫౌండేషన్ చైర్మన్ శ్రీమతి చక్రాల ఉష ఆధ్వర్యంలో తొట్టoబేడు మండలం లో శివనాధపురం గ్రామంలో ప్రాధమిక పాఠశాల యందు గురుపూజోత్సవం ఘనంగా నిర్వహించారు
సర్వేపల్లి రాధాకృష్ణ గారి చిత్రపటానికి పూలమాల వేసి విద్యార్థినీ విద్యార్థులు అందరి చేత పూజా కార్యక్రమం నిర్వహించారు తదుపరి
ప్రధానోపాధ్యాయులు నాగ సత్య ప్రసాద్ గారిని ఉపాధ్యాయిని ధనమ్మ గారిని ఘనంగా సత్కరించారు
చక్రాల ఉష మాట్లాడుతూ
అన్ని వృత్తులో కెల్లా ఉపాధ్యాయ వృత్తి ఎంతో విశిష్టత కలిగిందని వేల మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపే మహత్తర కార్యం ఈ వృత్తిలోనే సాధ్యమని , ఎటువంటి స్వార్థం లేకుండా ప్రతి ఒక్కరిని తమ బిడ్డలుగా భావిస్తూ అందరినీ ఉన్నత స్థానాల్లో పంపే ప్రయత్నంలో గురువులు ఉంటారని, ఆ గురువులు యొక్క ఆశీస్సులు ప్రతీ విద్యార్థినీవిద్యార్థులు వినియోగించుకొని చక్కని ప్రతిభ కనబరచాలని , ఈ వయసులోనే లక్ష్యం ఏర్పరచుకొని దానికి అనుగుణంగా ప్రతి ఒక్కరు సాధన చేయాలని మంచి ఉజ్వల భవిష్యత్తు ఉన్నత స్థానాల్లోకి వెళ్లాలని కోరుకున్నారు
నాగ సత్య ప్రసాద్ గారు 2017లో శివనాధపురం ప్రాధమిక పాఠశాల కి విచ్చేసినప్పుడు కేవలం 9మంది విద్యార్థులు ఉన్నప్పటికీ, అప్పటి నుండి ఆయనే స్వయంగా శ్రద్ధ తీసుకొని ఇంటింటికి తిరుగుతూ తల్లితండ్రుల్లో ప్రభుత్వపాఠశాలల మీద ఉన్న చులకన భావాన్ని రూపుమాపి అంచెలంచెలుగా విద్యార్థులను పెంచుకుంటూ ఇప్పుడు 45 మందికి చేర్పించడం ఆయన ఘనతనే చెప్పుకోవాలంటూ కొనియాడారు వారి దగ్గరే నేను కూడా 1996 సంవత్సరంలో ఇంటర్ విద్యార్థిగా చదువుకోవడం గుర్తు చేసుకున్నారు
ఈ కార్యక్రమం పూర్వ విద్యార్థి హారతిమునీశ్వరి , విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు
No comments:
Post a Comment