భక్త కన్నప్ప కొండ అభివృద్ధి పనులను పర్యవేక్షించిన చైర్మన్: అంజూరు శ్రీనివాసులు - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, September 29, 2022

భక్త కన్నప్ప కొండ అభివృద్ధి పనులను పర్యవేక్షించిన చైర్మన్: అంజూరు శ్రీనివాసులు

 భక్త కన్నప్ప కొండ అభివృద్ధి పనులను పర్యవేక్షించిన చైర్మన్: అంజూరు శ్రీనివాసులు 




 స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :


శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం నందు కన్నప్ప కొండ యందు వెలసిన ప్రథమ భక్తుడైన భక్త కన్నప్ప స్వామి దేవాలయము నందు రాబోవు బ్రహ్మోత్సవాలలో ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉండే విధంగా  శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు గారు, పాలకమండలి సభ్యులు సాధన మున్నా రాయల్ మరియు ఆలయ అధికారులైన AE వేణు మరియు కాంట్రాక్టర్లతో కలిసి అభివృద్ధి పనులను పర్యవేక్షించినారు.


ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు మాట్లాడుతూ  రాబోవు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు కన్నప్ప కొండపై నూతన అభివృద్ధి పనులలో భాగంగా 

 మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ప్రారంభం ముందు రోజు  కన్నప్ప కొండపై నుండి ముక్కోటి దేవతలను  మరియు సప్త ఋషులను ఆహ్వానించుటకు ఇదివరకు ఇక్కడ బండల మీద  నిలబడి ఉత్సవం నిర్వహించుట  పరిస్థితిగా చాలా కష్టతరంగా ఉండటం చేత అక్కడ పూర్తిగా శుభ్రంగా చదును పరిచి కాంక్రీట్ తో నిర్మాణం చేపట్టామని, అలాగే ఆలయం నందు గల ధ్వజస్తంభమునకు చుట్టూ ప్రదర్శనలు చేయుటకు పూజారులు కూడా తిరగలేనంతగా ఇబ్బందికరంగా ఉండుట చేత దానిని కూడా బాగా ముందుకి 6 అడుగుల దాకా పెంచి ధ్వజ స్తంభం చుట్టూ విశాలంగా ప్రదేశం ఉండేటట్లుగా కట్టడాలు చేపట్టబోతున్నామని,

అదేవిధంగా ముఖ్యంగా  మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో    మొదటగా కన్నప్ప కొండ పైన నుంచి  

మొదటి పూజా కార్యక్రమం నిర్వహించే భక్త కన్నప్ప స్వామి వారి ఆలయమునకు ఆచార వ్యవహారాల ప్రకారం  బోయ వంశస్థులు స్వామి అమ్మవార్లను  తీసుకొస్తారని, తీసుకొచ్చే మెట్ల దారి చాలా ఇరుకుగా మరియు మెట్ల పరిమాణం ఎత్తుగా పెద్దవిగా ఉండటం చేత చాలా కష్టతరం గా ఉంటుందని అటువంటి మెట్లను ఇప్పుడు దాదాపు 12 అడుగుల మేరకు పెంచి మెట్ల యొక్క పరిమాణం కూడా పల్లకిని ఎత్తుకొని వచ్చి వెళ్ళుటకు సులభ తరముగా ఉండేటట్లుగా మెట్లు యొక్క పుననిర్మాణ పనులు జరుగుతున్నదని వాటిని కూడా పరిశీలించామని,

అలాగే కన్నప్ప కొండ పైన వెలిసిన శివపార్వతుల విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం కూడా  గౌరవ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి గారి సూచనల మేరకు అతి త్వరలోనే ప్రారంభోత్సవం చేయబోతున్నామని, రాబోవు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా  ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించేందుకు దేవస్థానం ధర్మకర్తల మండలి మరియు ఆలయ అధికారులతో సమన్వయంగా కలిసి గొప్పగా నిర్వహిస్తామని తెలియజేశారు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad