అర్ధనారీశ్వరాలయంలో సప్త గోకులం ఏర్పాటుకు సన్నాహాలు
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
దక్షిణకాశీగా ప్రాచుర్యం పొందిన శ్రీకాళహస్తి దివ్య క్షేత్రంలో నెలకొని ఉన్న శ్రీ అర్ధనారీశ్వర స్వామి దేవస్థానం ప్రత్యేక ఆకర్షణను సంతరించుకుని ఏకలింగంలో స్వామి అమ్మవార్ల దర్శనం కల్పిస్తూ విచ్చేసిన భక్తుల కొంగు బంగారం చేస్తున్న తరుణంలో దేవాలయం రోజురోజుకు అభివృద్ధి చెందుతున్న దృష్ట్యా ఆలయ ప్రాంగణంలో సప్త గోకులాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించిన శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం.
దేవస్థానమునకు సంబంధించిన భరద్వాజ తీర్థం నందు ఏర్పాటయిన్న గోశాల నందు దాదాపు 832 గోవులు దూడలు, ఎద్దులు కలవు. అదేవిధంగా శ్రీకాళహస్తి దేవస్థానం మొదటి గోపురం ద్వారం వద్ద ఏడు రకాల జాతుల ఆవు-దూడలతో ఏర్పాటయి ఉన్న సప్త గోశాల నందు ప్రతిరోజు గోపూజ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నది. అదేవిధంగా అర్ధనారీశ్వరాలయం నందు కూడా గౌరవ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి గారి ద్వారా సప్త గోవులతో గోశాలను ఏర్పాటు చేయాలని ఆలయ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు గారు ఆలయ అధికారులైన డి. ఇ. మురళీధర్, ఎ. ఇ. కిషోర్ లతో కలిసి స్థల పరిశీలన చేయడం జరిగినది.
ఈ సందర్భంగా చైర్మన్ అంజూరు శ్రీనివాసులు గారు మాట్లాడుతూ సకల దేవతలు నిక్షిప్తమైనది గోవు ఒక్కటే నని, అటువంటి గోమాతలను పూజిస్తే సకల దేవతలలు పూజించిన ఫలం దక్కుతుందని, అటువంటి దివ్యమైన వాతావరణం శివాలయాల్లో మాత్రమే ఉండటం చేత ఇదివరకే దేవస్థానం నందు సప్త గోశాల కొలువైవుండటం మన పూర్వజన్మ సుకృతం, అదే విధంగా మన శాసనసభ్యులు బియ్యపు మధుసూదనరెడ్డి గారికి అత్యంత ప్రీతికరమైన ప్రదేశం, నిత్యం అర్ధనారీశ్వర స్వామి వారిని కొలుస్తూ ఉంటారు కావున అర్ధనారీశ్వర ఆలయంలో కూడా సప్త గోవులతో గోశాలను ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలోని భక్తులందరికీ అందుబాటులో ఉండి శుభం చేకూరేలా గోశాల నిర్మాణం చేపట్టామని, కావున గోశాల నిర్మాణం కు సంబంధించి దేవస్థానం తరపున టెండర్ ప్రక్రియ కూడా పూర్తయి ఉన్నది కావున రాబోవు కొద్ది రోజుల్లో మంచి ముహూర్తాన శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి గారి ద్వారా ఆలయ కార్య నిర్వహణ అధికారి సాగర్ బాబు, ధర్మకర్తల మండలి, ప్రత్యేక ఆహ్వానిత సభ్యులు మరియు ఆలయ అధికారులతో నిర్మాణ రూపురేఖలు దిద్దుకొని అతి త్వరలో భూమి పూజ కార్యక్రమం కూడా నిర్వహిస్తామని చైర్మన్ అంజూరు శ్రీనివాసులు తెలియజేశారు.
No comments:
Post a Comment