ఏడు గంగమ్మల దేవాలయము నవరాత్రి ఉత్సవాలలో పాల్గొన్న అంజూరు తారక శ్రీనివాసులు
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం అనుబంధాలయమైన ముత్యాలమ్మ గుడి వీధి నందు వెలసి ఉన్న శ్రీ ఏడు గంగమ్మల అమ్మవారి దేవాలయము నకు శ్రీకాళహస్తి దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు నవరాత్రి ఉత్సవాలలో భాగంగా జగన్మాత,ఆది పరాశక్తి శ్రీ శ్రీ శ్రీ ఏడు గంగమ్మ ల అమ్మవారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ మర్యాదలతో స్వర్ణ మూర్తి స్వాగతము పలికారు. శ్రీ చంద్రఘంటా దేవి అలంకరణతో వున్న అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులను మరియు తీర్ధప్రసాదలను అందజేశారు. దర్శనానంతరం చైర్మన్ అంజూరు శ్రీనివాసులు మాట్లాడుతూ పట్టణము లోని అన్నీ శక్తి అమ్మవార్ల ఆలయాలకు (దేవస్థాన అనుబంధ ఆలయాలు) అన్నీ సౌకర్యాలు కల్పించామని తెలియజేశారు. అదేవిధంగా మహిళా భక్తులు చాలా మంది అమ్మవారి మాలధారణ ధరించి భక్తి శ్రద్ధలతో కొలుస్తున్నారని తెలియజేశారు. అంతేకాక ఈ ఏడాది డిసెంబర్ మాసంలో నిర్వహించే ఏడు గంగమ్మ ల జాతర ను ప్రియతమ శాసనసభ్యులు శ్రీ మధుసూదన రెడ్డి సూచనల మేరకు అంగరంగ వైభవంగా జరిపించాలని, జాతర ముగిసిన అతిత్వరలోనే శ్రీ ఏడు గంగమ్మ ల ఆలయాన్ని జీర్ణోధారణ చేయనున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కోళ్లూరు హరినాయుడు, సెన్నేరు కుప్పం శేఖర్, మొగారాల గణేష్, గరికపాటి చంద్ర, శివకుమార్, బాల గౌడ్, తేజ, సునిల్ తదితరలు మరియు స్థానిక మహిళా భక్తులు తదితరులు పూజా కార్యక్రమాలు లో పాల్గొన్నారు.
No comments:
Post a Comment