నిస్స్వార్డానికి నిదర్శనం ఉపాధ్యాయుడు; పవార్
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
ఈ సృష్టిలో ఎవరి ఋణం అయినా తీర్చుకోవచ్చు, కానీ ఒక్క ఉపాధ్యాయుడి ఋణం మాత్రం తీర్చుకోలేనిది అని ది స్కూల్ కరస్పాండెంట్ జనార్దన రావు.జె.పవార్ అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ది స్కూల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో ఆయన మాట్లాడుతూ నిస్స్వార్ధమైన వ్యక్తి ఉపాధ్యాయుడు అని అన్నారు. ది స్కూల్ టీచర్ శ్రీమతి కె.ఇందుమతి, శ్రీ ఎం.పరశురామ్ ( రిటైర్డ్ డ్రాయింగ్ టీచర్) దంపతులను దుస్సాలువతో ఘనంగా సత్కరించారు. ఎం.పరశురామ్ మాట్లాడుతూ విద్యార్దికి ఏకాగ్రత, క్రమశిక్షణ, ఉపాధ్యాయుడి పట్ల గౌరవం వుండాలి అని అన్నారు. అనంతరం విద్యార్థుల ప్రసంగాలు, నాట్యాలు ఎంతగానో ఆక్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాటశాల ప్రధాన ఉపాధ్యాయురాలు పి.విశాల, ఉపాధ్యాయ బృందం, తల్లి దండ్రులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment