న్యాయవాదులు , పారా లీగల్ వాలంటరీలు శ్రీకాళహస్తి పట్టణంలోని సబ్ జైల్ పరిశీలించారు.
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
సబ్-జైలు పరిసర ప్రాంతాలు, వారి వసతి గదులు, బాత్ రూమ్ లు , భోజనశాల ...మొదలైనవి పరిశుభ్రతపై పరిశీలించారు. తర్వాత ఖైదీలకు పెట్టె భోజనము వారితో బాటుతిని, భోజన సదుపాయాలు బాగున్నాయని అన్నారు. అనంతరం ఖైదీలతో మాట్లాడి సమస్యల పై అరా తీశారు. వారి సమస్యలను సంబంధిత గౌరవ న్యాయమూర్తులకు తెలియజేస్తామన్నారు
న్యాయవాదులు మాట్లాడుతూ గౌరవ జిల్లా జడ్జి మరియు శ్రీకాళహస్తి సీనియర్ సివిల్ జడ్జి ఆదేశాలమేరకు ఈ రోజు సబ్-జైలు ను సందర్శించడం జరిగినది, ఇద్దరు ఖైదీలు ఆర్థిక స్తోమత లేక ప్రభుత్వ న్యాయవాదుల్ని అడిగారు గౌరవ జడ్జి గారికి తెలిపి ఏర్పాటు చేస్తామని తెలిపారు. అలాగే ప్రతిరోజు ఏర్పాటు చేసిన మెనూ ను పరిశీలించి మెనూ ప్రకారం అందిస్తున్నారు లేదా అని ఖైదీలని విచారించారు, .అలాగే ఖైదీలు కొన్ని సమస్యలు తెలిపారు, వాటిని గౌరవ శ్రీకాళహస్తి సీనియర్ సివిల్ జడ్జి గారికి తెలిపి త్వరితగతిన పరిష్కరించుటకు ప్రయత్నిస్తామని అన్నారు
కార్యక్రమములో న్యాయవాదులు గరికపాటి రమేష్ బాబు,ప్రజ్ఞశ్రీ, పారా లీగల్ వాలంటరీ లు పాల్గొన్నారు.
No comments:
Post a Comment