బండారుపల్లి గ్రామం లో ఉచిత వైద్య శిబిరం విజయవంతం - స్వర్ణముఖి న్యూస్

.com/img/a/

NEWS

Home Top Ad

temple%20ad%20%20copy

Post Top Ad

Sunday, May 25, 2025

demo-image

బండారుపల్లి గ్రామం లో ఉచిత వైద్య శిబిరం విజయవంతం

poornam%20copy

 బండారుపల్లి గ్రామం లో ఉచిత వైద్య శిబిరం విజయవంతం.

WhatsApp%20Image%202025-05-25%20at%2015.39.12_5faf8b0b

స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :

      శ్రీకాళహస్తి MGM హాస్పిటల్స్ మరియు REDCROSS సంస్థ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి మండలం బండారుపల్లి గ్రామం నందు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో దాదాపు 200 మంది పాల్గొన్నారు. MGM హాస్పిటల్స్ ఆధ్వర్యంలో  వైద్య శిబిరంలో పాల్గొన్న ప్రతీ ఒక్కరికి డాక్టర్లు పరీక్షించి అవసరమగు పరీక్షలు చేసి మందులు ఉచితం గా నే అందజేశారు. బండారుపల్లి గ్రామంలో ఉచితంగా వైద్య శిబిరం నిర్వహించిన MGM హాస్పిటల్స్ యాజమాన్యానికి మరియు REDCROSS సొసైటీ వారికి బండారుపల్లి గ్రామ పెద్దలు ధన్యవాదములు తెలిపారు. REDCROSS సొసైటీ వారు దగ్గరుండి వైద్య శిబిరంలో అవసరతలను పర్యవేక్షించారు. పై కార్యక్రమంలో MGM హాస్పిటల్స్ డైరెక్టర్ గుడ్లూరు మయూర్ మాట్లాడుతూ శ్రీకాళహస్తి మరియు చుట్టు పక్క గ్రామాల ఆరోగ్య దృష్ట్యా MGM హాస్పిటల్స్ నందు 24 గంటలు వైద్యులు అందుబాటులో ఉంటారని అలాగే NTR వైద్య సేవ, EHS మరియు పలు రకాల ఇన్సూరెన్సు సేవలు పూర్తి ఉచితంగా అందుబాటులో కలవని తెలిపారు. ఈ వైద్య శిబిరం లో MGM హాస్పిటల్స్ డాక్టర్ లు డాక్టర్ వివేక్ చైతన్య (గుండె వైద్య నిపుణులు), డాక్టర్ ఉమామహేశ్వర్ రావు (చిన్న పిల్లల వైద్య నిపుణులు ), డాక్టర్ లక్ష్మి ప్రసన్న (స్త్రీ సంబంధిత వైద్య నిపుణులు), డాక్టర్ అర్చన (పంటి సంబంధిత వైద్య నిపుణులు), హాస్పిటల్స్ సిబ్బంది, REDCROSS సొసైటీ సభ్యులు, బండారుపల్లి గ్రామ పెద్దలు పాల్గొన్నారు

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages