స్వచ్ఛఅమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో : పవిత్ర రెడ్డి
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
స్వచ్ఛఅమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా శ్రీకాళహస్తి పురపాలక సంఘం కమిషనర్ బాలాజీ నాయక్ ఆధ్వర్యంలో స్వచ్ఛఅమృత్ మహోత్సవ్ అవగాహన ర్యాలీ పురపాలక సిబ్బంది మరియు గ్రీన్ అంబాసిడర్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శ్రీ కాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కుమార్తె శ్రీపవిత్ర రెడ్డి బియ్యపు పాల్గొన్నారు.
పవిత్ర రెడ్డి మరియు కమిషనర్ బాలాజీ నాయక్ చీపురులు చేతబట్టి మార్కెట్ పరిసర ప్రాంతాలను పరిశుభ్రం చేశారు.
పవిత్ర రెడ్డి మాట్లాడుతూ..
స్వచ్ఛఅమృత్ మహోత్సవ్ లొ భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సెప్టెంబర్ 15వ తేదీ నుంచి అక్టోబర్ రెండు వరకు,స్వచ్ఛఅమృత్ మహోత్సవ్ కార్యక్రమలు నిర్వహింపబడతాయని ఈ కార్యక్రమంలో యువత చురుగ్గా పాల్గొనడం అభినందనీయమన్నారు. పరిశుద్ధమైన,
ఆరోగ్యవంతమైన భారత్ ను ఆవిష్కరించాలన్న మహాత్ముని కలను నిజం చేసి చూపించాలనిఅన్నారు ప్రజలు అనారోగ్యం పాలు కాకుండా మీ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ప్రతి ఒక్కరు నీటిని కాంచి వడగట్టి తాగాలని మరియు ప్రతి ఒక్కరు ఇంటి వద్దనే తడి చెత్త పొడి చెత్త వేరు చేసి గ్రీన్ అంబాసిడర్ లకు ఇవ్వాలని కోరారు.
ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి కమీషనర్ బాలాజీ నాయక్,పట్టణ అధ్యక్షులు పగడాల రాజు,పట్టణ యువత అధ్యక్షులు మదు రెడ్డి,వార్డ్ ఇంఛార్జి ఘోర,మురళి యాదవ్, ఫజల్,రామచంద్ర రెడ్డి,ట్రస్ట్ బోర్డ్ మెంబర్ సుమతి, సునిత సింగ్,మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment