మైనర్ బాలికకు న్యాయం జరిగే వరకూ పోరాటం ఆగదు : చక్రాల ఉష
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
మూడుహత్యలు ఆరు అత్యాచారాలతో రాష్ట్రాన్ని బ్రష్టు పట్టిస్తున్న వైసీపీ
ఇంకా ఎంతమంది బాలికలు బలయితే మీకూ నిద్రమత్తు వదులుతుంది???
వెంకటగిరి పట్టణంలో ఇటీవల మైనర్ బాలికను అత్యాచారం చేసి నిర్భయంగా బయట తిరుగుతున్న నిందుతులను కఠినంగా శిక్షించి ఆ మైనర్ బాలికకు న్యాయం చెయ్యాలని మాజీ శాసనసభ్యులు గౌ. కురుగుంట్ల రామకృష్ణ , తిరుపతి పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు చక్రాల ఉష , ప్రధాన కార్యదర్శి మట్టం శ్రావణి , రాష్ట్ర మహిళా కార్యదర్శి కన్నెమ్మ , నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు కౌసల్యమ్మ ,టౌన్ పార్టీ కార్యాలయంలో మహిళా నాయకురాళ్ళు , పట్టణ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు
మైనర్ బాలికను గర్భవతి ని చేసిన ఉన్మాదికి అండగా నిలిచిన వైసీపీ నాయకుడు
భాదితులకు అండగా నిలిచి పరామర్శకు వెళ్లిన టీడీపీ నాయకుల మీద తప్పుడు కేసులు పెట్టడం హేయమైన చర్య
ఈ సందర్బంగా కురుగుంట్ల రామకృష్ణ మాట్లాడుతూ
మా పరిపాలన లో గతంలో ఇటువంటి ఘటనలు జరిగేటివి కాదు,తప్పు చేయాలంటే భయపడే వాళ్ళు ఈ మూడున్నర సంవత్సర కాలం లో అత్యాచారాలు హత్యలు దోపిడీలు దొంగతనాలు, దౌర్జన్యాలు అరాచకాలు అకృత్యాలు , మట్టి దోపిడీ, ఇసుక దోపిడీ, లిక్కర్ దోపిడీ, సిలికాన్ దోపిడీ విచ్చలవిడిగా పెరిగాయే గానీ శాంతిభద్రతలు లేవు అధికారులను పోలీస్ సిబ్బందిని వైసీపీ నాయకులు కనుసన్నల్లో పెట్టుకొని రాక్షసపరిపాలన అందిస్తున్నారని, అమాయక బాలికల మాన ప్రాణాలకు భద్రత లేకుండా పోవడం బాధాకరమని పైగా ఆడబిడ్డల మానప్రాణాలకు వెలకట్టి తప్పిoచుకునే ప్రయత్నాలు చేయడం తీవ్రంగా ఖండిoచి భాధిత కుటుంబానికి అండగా నిలుస్తామని ఆ బిడ్డకు న్యాయం జరిగే వరకూ పోరాడతామని అన్నారు
తిరుపతి పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు చక్రాల ఉష మాట్లాడుతూ జగన్ రెడ్డి పాలనలో రోజుకో అత్యాచారం రోజుకో హత్యా నిత్యకృత్యమయ్యిందని భయం లేనితనం వల్లే విచ్చలవిడిగా ఆగాయత్యాలు జరుగుతూనే ఉన్నాయని ప్రభుత్వానికి చలనం లేకపోవడం మహిళల మీద వారికున్న చులకన భావం అర్థమవుతోందని, ప్రజా సంకల్పయాత్రల్లో జగన్ రెడ్డి చెప్పిన మాటలు గుర్తు చేస్తూ ఆడబడుచులకు అన్న అన్నావ్ బాలికలకు మేనమామ అన్నావే మరీ ప్రతీ రోజూ మేనకోడళ్ళు చితికిపోతున్నారని, ఆడబడుచులు అత్యాచారాలకు బలయ్యి వారి అర్థనాధలు వినబడం లేదా, ఉన్న చట్టాలు అమలు పరిచలేక దిశా దశ అంటూ ప్రజలని బురిడీ కొట్టిస్తున్నాడని 21రోజూల్లో ఎవడికన్నా దిశా చట్టం అమలాయ్యిందా అని ప్రశ్నించారు, ఈ రాష్ట్రనికి మూడు రాజధానులు కడతానన్న అన్నయ్య రాజధానులు కట్టలేకపోయినా రాష్ట్రనికి మూడు పేర్లు పెట్టాడని *అత్యాచారాంధ్రప్రదేశ్ 1
కామాందులాంధ్రప్రదేశ్ 2
కల్తీమద్యమాంద్రప్రదేశ్ 3
అని ఎద్దేవా చేశారు
పరిపాలన చేతకాకే వైసీపీ మహిళా నాయకురాళ్ళ చేత భూతుల పురాణం మొదలెట్టారని, కావలి లో వైసీపీ నాయకుల చేత వేధింపబడి అమాయకుడు కరుణాకర్ బలయితే లోకేష్ అన్నలా ఆ కుటుంబానికి అండగా నిలిచి కరుణాకర్ భార్య వారి ఇద్దరి ఆడబిడ్డలకు సహాయసహకారం అందిస్తే వెంటనే మీడియా ముందుకు కాకని గోవర్ధన్ కావ్ కావ్ మంటూ తప్పుడు ప్రవచనాలు మాట్లాడంలోనే తెలుస్తోంది వాళ్లకు మహిళలమీద ఉన్న చిత్తశుద్ధి అని, నెల్లూరు జిల్లా లో నారాయణ కుటుంబానికి బాసటగా నిలిచి సోమిరెడ్డి చంద్రమోహన్ పోరాడి ఆ కుటుంబానికి సహాయసహకారం అందించే వరకూ ప్రభుత్వానికి చలనం లేదని,తిరుపతి పార్లమెంట్ పరిధిలోనే వెంకటగిరి నియోజకవర్గం ఈ 12ఏళ్ల చిన్నారి, ఈ మద్య ఇదే నియోజకవర్గం లో మరో అమ్మాయిని గొంతుకోసి పరారైన హంతకుడు ఏమయ్యాడని, రెండు రోజుల క్రితం సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండలంలో మరో 13ఏళ్ల ఆడబిడ్డ మీద జరిగిన అత్యాచార ప్రయత్నం యాసీడ్ పోసి గొంతుకోసిన ఘటన, గూడూరులో తేజస్విని అనే విద్యార్థిని పట్టపగలు ఇంట్లో జొరబడి గొంతుకోసి చంపిన ఘటన, అంతకముందు సత్యవేడులో 12ఏళ్ల చిన్నారి మీద జరిగిన అత్యాచార ఘటన, శ్రీకాళహస్తి లో ఉమామహేశ్వరీ ఘటన, తిరుపతిలో అనేక అత్యాచారాల సంఘటనలు లెక్కే లేదంటే మీ దద్దమ్మ ప్రభుత్వం కచ్చితంగా కల్తీమద్యo తాగి నిద్రపోతోందేమో అని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ ప్రభుత్వాలో ఆడబిడ్డలని ఆటబొమ్మాల్లా చూస్తూన్నారని,
భాధితుల మాన ప్రాణాలు మేము తిరిగి తాలేమేమో కానీ భాధిత కుటుంబాల కోసం వారికి న్యాయం జరిగే వరకూ తెలుగుమహిళలు అండగా నిలిచి పోరాడతామని అన్నారు
ప్రధాన కార్యదర్శి మట్టం శ్రావణి, రాష్ట్ర మహిళా కార్యదర్శి కన్నెమ్మ, పట్టణ అధ్యక్షులు గంగాధర్,పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి రాజేశ్వరరావు మాట్లాడుతూ
తప్పుడు కేసులకు భయపడే వాళ్ళంకామని చిన్నారి కి అండగా నిలిచి న్యాయం జరిగే వరకూ పోరాడతామని అన్నారు
పార్లమెంట్ అనుబంధ కమిటీ నాయకులు, పట్టణ కమిటీ నాయకులు, అనుబంధ కమిటీ నాయకులు, మహిళా నాయకురాల్లు, నియోజకవర్గ అనుబంధ కమిటీ నాయకులు, ఐటీడీపి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment