ఆదిదంపతుల ఉత్సవమూర్తులకు అలంకరణ ఆభరణములు వితరణ
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
దక్షిణ కైలాసం శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత వాయు లింగేశ్వర స్వామి అమ్మవార్లు కొలువైన పుణ్యక్షేత్రం నందు నిత్య కళ్యాణమస్తులైన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి, ఆదిదంపతులైన శ్రీ సోమస్కంద మూర్తి స్వామి- శ్రీ జ్ఞాన ప్రసూనాంబికాదేవి ఉత్సవమూర్తులకు నెల్లూరుకు చెందిన భక్తులు ఆది కేశవరెడ్డి గారు మరియు వారి కుటుంబ సభ్యులు ఉత్సవమూర్తుల అలంకార ఆభరణములను శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండల అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు గారికి ఆలయం నందు శ్రీ గురు దక్షిణామూర్తి స్వామి వారి సన్నిధానం వద్ద ఆలయ వేద పండితులచే పూజా కార్యక్రమాలు నిర్వహించి చైర్మన్ గారి ద్వారా దేవస్థానమునకు వితరణగా సమర్పించినారు.
ఈ సందర్భంగా చైర్మన్ అంజూరు శ్రీనివాసులు ఆదిదంపతులైన స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు సుమారు రూ. 3,73,500/- విలువజేసే బంగారు పూత కలిగిన పంచలోహ ఆభరణాలు వితరణగా సమర్పించిన ఆది కేశవరెడ్డి వారి కుటుంబ సభ్యులకు తల్లి జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయు లింగేశ్వర యొక్క చల్లని దీవెనలు ఎల్లవేళలా తోడుంటాయని తెలియజేసి, వారికి స్వామి అమ్మవార్ల ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేయించి శేష వస్త్రాలతో సత్కరించి, స్వామి అమ్మవార్ల చిత్రపటాన్ని వేద పండితులచే ఆశీర్వాదాలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ఇన్స్పెక్టర్ సురేష్ రెడ్డి, ఆలయ వేద పండితులు అర్ధగిరి స్వామి, శ్రీనివాస శర్మ స్వామి తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment