లడ్డు పోటు ఆకస్మిక తనిఖీ : అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం నందు స్వామివారి ప్రసాదాలు తయారు చేయు లడ్డు పోటు ను శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు అకస్మికంగా తనిఖీ చేశారు. ఆలయం నందు గల లడ్డు తయారు చేయు గదిలో వెలువడు ఉష్ణానికి గోడలు పెచ్చులు పెచ్చులుగా రాలిపోవడం మరియు అక్కడ ఉన్న అపరిశుభ్రతను గమనించిన చైర్మన్ గారు వెంటనే సానిటరీ సిబ్బందిని పిలిపించి స్పెషల్ డ్రైవ్ క్రింద వెంటనే శుభ్రపరచాలని అక్కడే పాలక మండలి సభ్యులైన పసల సుమతి, కొండూరు సునీత, రమాప్రభ వార్లతో కలిసి ఉండి పనులను పర్యవేక్షించినారు. అదేవిధంగా పాడైపోయి ఉన్న గోడలన్నీ మరమ్మత్తులు చేయాలని, అలాగే వేడి వెలువడుతున్న గోడలకు వెంటనే స్టెయిన్లెస్ స్టీల్ తో ప్లేట్లను అమర్చవలెనని A. E. వేణు, వర్క్ ఇన్స్పెక్టర్ ప్రతాప్ లకు అదేశాలు జారీ చేశారు.
No comments:
Post a Comment