రన్ శ్రీకాళహస్తి రన్ కార్యక్రమం విజయవంతం.
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
ప్రపంచ హృదయ దినోత్సవ సందర్బంగా MGM హాస్పిటల్స్ నుండి శ్రీకాళహస్తి 2 టౌన్ పోలీస్ స్టేషన్ వరకు నిర్వహించిన రన్ శ్రీకాళహస్తి రన్ కార్యక్రమాన్ని శ్రీకాళహస్తి MLA బియ్యపు మధుసూదన్ రెడ్డి గారి కుమార్తె బియ్యపు పవిత్ర రెడ్డి జండా ఊపి ప్రారంభించారు. 3 కిలోమీటర్లు సాగిన ఈ రన్ శ్రీకాళహస్తి రన్ కార్యక్రమం లో MGM హాస్పిటల్స్ డైరెక్టర్ గుడ్లూరు మయూర్ , శ్రీకాళహస్తి మునిసిపల్ చైర్మన్ శ్రీ బాలాజీ నాయక్ , శ్రీకాళహస్తిశ్వర స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు , శ్రీకాళహస్తి మరియు తొట్టంబేడు మండలాల పోలీస్ శాఖ వారు మరియు 500 మంది ప్రజలు పాల్గొన్నారు. పవిత్ర రెడ్డి మాట్లాడుతూ ఈ రన్ శ్రీకాళహస్తి రన్ లాంటి కార్యక్రమాల ద్వారా ప్రజలు రాబోయే రోజుల్లో వారి ఆరోగ్యం కొరకు ప్రతి రోజు వ్యాయామం చేస్తూ అందరు ఆరోగ్యం గా ఉండాలని ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం అని తెలిపారు. దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు మాట్లాడుతూ గుండె కు సంబంధించిన ఈ గొప్ప కార్యక్రమం లో పాల్గొన్న ప్రతి ఒక్కరు రాబోయే రోజుల్లో ప్రతిరోజూ వారి ఆరోగ్య కోసం వ్యాయామం చేసుకుంటే మంచిది అని తెలిపారు. MGM హాస్పిటల్స్ డైరెక్టర్ గుడ్లూరు మయూర్ మాట్లాడుతూ మా MGM హాస్పిటల్స్ దగ్గరనుండి ప్రారంభించిన ఈ రన్ శ్రీకాళహస్తి రన్ కార్యక్రమం లో ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో ఇలాంటప్పుడు ఆరోగ్య అవగాహనా కార్యక్రమాలు మరెన్నో చేయుటకు సిద్ధంగా గా ఉన్నామని మా MGM హాస్పిటల్ నందు 24 గంటలు అత్యాధునిక వసతులతో అత్యవసర సేవలు అందుబాటులో వుంటాయని తెలిపారు.పై కార్యక్రమంలో శ్రీకాళహస్తి పట్టణ ప్రజలు, MGM జూనియర్ కాలేజీ విద్యార్థులు, MGM కాలేజీ మరియు స్కూల్ సిబ్బంది, MGM హాస్పిటల్స్ సిబ్బంది పాల్గొన్నారు.
No comments:
Post a Comment