స్విమ్స్ విద్యార్థులకు ఉచితంగా భోజనం ,నూతన వంటశాలను ప్రారంభించిన టిటిడి ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి
స్వర్ణముఖిన్యూస్ ,తిరుపతి:
స్విమ్స్‌లో ఫిజియోథెరపీ, నర్సింగ్, పారామెడికల్ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా భోజన సదుపాయం కల్పించడం కోసం ఏర్పాటుచేసిన నూతన వంటశాలను టిటిడి ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి శుక్రవారం ప్రారంభించారు. నూతనంగా ఏర్పాటుచేసిన వంటశాలలోని సదుపాయాలను పరిశీలించారు. విద్యార్థులకు తయారుచేసే ఆహారానికి సంబంధించిన మెను గురించి అడిగి తెలుసుకున్నారు.
No comments:
Post a Comment