ఏర్పేడు మండలం, గుడిమల్లం, పరశురామేశ్వర స్వామి వారి దేవాలయం స్వామి వారిని దర్శించుకున్న శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు .
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
దాదాపు 5వేల సంవత్సరాల క్రితం నుండి ఎంతో విశిష్టతను కలిగి, ఆ పరమేశ్వరుని లింగరూపాలలోనే అరుదైన లింగరూపం దాల్చి, సర్వ దేవతామూర్తులు, పరివార దేవతలు నిక్షిప్తమై ఉన్న మహా పుణ్యక్షేత్రం అతి పురాతనమైన దేవాలయమైన శ్రీ పరశురామేశ్వర స్వామి వారి దర్శనార్థం శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు గారు వారి దంపతులు మరియు పాలకమండలి సభ్యులైన ప్రభావతి, పసల సుమతి కొండూరు సునీత, నీల, లక్ష్మీ విచ్చేశారు. వారికి ఆలయ చైర్మన్ నరసింహ యాదవ్ మంగళ వాయిద్యాలతో ఘనంగా పలికి ఆలయంలోని దేవతామూర్తుల యొక్క విశిష్టతను మరియు ఆలయంలో ప్రతి సంవత్సరం జరుగు సూర్య భగవానుని కిరణాల యొక్క ప్రత్యేకతను వివరించి దర్శన ఏర్పాట్లు చేయించారు. తదనంతరం స్వామి వారి అంతరాలయం నందు ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆలయ ప్రధాన అర్చకులు వంశీ శర్మ స్వామి వారు స్వామి వారి యొక్క చరిత్రను వివరించి పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం స్వామి వారి శేష వస్త్రాలతో చైర్మన్ అంజూర్ శ్రీనివాసులు గారిని మరియు శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం పాలకమండలి సభ్యులను సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
No comments:
Post a Comment