కనకదుర్గమ్మ ఆలయ మహాకుంభాభిషేకం
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం అనుబంధ ఆలయం శ్రీ దుర్గమ్మ ఆలయం నందు మహా కుంభాభిషేకం మహోత్సవము వేద మంత్రోచ్ఛరణలుతో అత్యంత వైభవంగా శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు గారి సారథ్యంలో కనకాచలం కొండపై వెలసిన శ్రీ దుర్గమ్మ ఆలయ మహాకుంభాభిషేక పూజలను వేదోయుక్తంగా చేపట్టారు.
ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో ముందుగా యాగశాలలో కలశ పూజలు జరిపి, హోమ పూజలను నిర్వహించారు. అనంతరం ప్రధాన కలశాలను ఊరేగింపుగా తీసుకువెళ్లి ఆలయ శిఖరం పై శిఖర కలశాలకు వేద మంత్రోచ్ఛరణలు తో అభిషేకాలు జరిపి విశిష్ట హారతిలు సమర్పించారు. అనంతరం శ్రీ దుర్గమ్మ మూలవిరాట్కు వివిధ రకాల పూజా ద్రవ్యాలతో విశేష అభిషేకాలు నిర్వహించి, ప్రధాన కలశ జలాలతో విశేష అభిషేకాలు జరిపారు. అనంతరం అమ్మవారికి దివ్య అలంకారం చేసి, ధూప దీప నైవేద్యాలు నివేదించి పూర్ణ హారతులు సమర్పించారు.
శ్రీకాళహస్తి దేవస్థానం చైర్మన్ అంజూరు శ్రీనివాసులు మాట్లాడుతూ దుర్గమ్మ ఆలయ మహా కుంభాభిషేకం నిర్వహించి 12 ఏళ్ళు అయిన సందర్భంగా మహా కుంభాభిషేకం వైభవంగా శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డి సూచన మేరకు వైభవంగా నిర్వహించడం జరిగినది అని తెలియజేశారు.
దేవస్థానం ఆధ్వర్యంలోని అన్ని అనుబంధ ఆలయాల్లో మహా కుంభాభిషేకాలు నిర్వహించి, మూలవిరాట్ కు శక్తి పునర్తేజం తీసుకొచ్చి ఈ ప్రాంతాలు సస్యశ్యామలంగా ఉండే విధంగా, ప్రజలందరూ సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు.
ఈ పూజాది కార్యక్రమాల్లో ఆలయ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు గారితో పాటూ ఆలయ ఏసీ మల్లికార్జున్ ప్రసాద్, ఎ.ఈ. ప్రవీణ్, లక్ష్మయ్య, స్థపతి కుమార్, దుర్గా ప్రసాద్, ధర్మకర్తల మండలి సభ్యులు కొండూరు సునీత సునీత, రమాప్రభ, ప్రత్యేక ఆహ్వానితులు చింతామణి పాండు, ఎంపీ లక్ష్మీ, నీలా వైసిపి నాయకులు హరి నాయుడు,పాలమంగళం రవి, బాల, తేజు, ప్రసాద్, మహర్షి, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment