శ్రీకాళహస్తి దేవస్థానంలో అత్యంత వైభవంగా ముగిసిన పవిత్రోత్సవాలు - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, September 11, 2022

శ్రీకాళహస్తి దేవస్థానంలో అత్యంత వైభవంగా ముగిసిన పవిత్రోత్సవాలు

 శ్రీకాళహస్తి దేవస్థానంలో అత్యంత వైభవంగా ముగిసిన పవిత్రోత్సవాలు








 స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :


శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో గత నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న పవిత్ర ఉత్సవాలు లో ఐదో రోజు శనివారం మూలవిరాట్ ల కు   పవిత్ర మాలధారణ తో విశేష పూజలతో ముగిశాయి. ఆలయంలోని యాగశాలలో ఆలయ ప్రధాన అర్చకులు స్వామినాథన్ గురుకుల్ ఆధ్వర్యంలో విశేష పూజాది కార్యక్రమాలు వేదొ యుక్తంగా జరిపారు. అనంతరం యాగశాల నుంచి పవిత్ర మాలలు,  విశేష పూజా ద్రవ్యాలను శ్రీకాళహస్తి దేవస్థానం పాలక మండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు దేవస్థానం మరియు పాలకమండలి సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు సారథ్యంలో ఊరేగింపుగా తీసుకొని వెళ్లి,  తొలుత రంగులు గోపురం వద్ద ఉన్న వినాయకునికి పవిత్ర మాల సమర్పించి,  తదుపరి ఆలయ ప్రాంగణంలో ఉన్న పరివార దేవతామూర్తులకు అందరికీ పవిత్రమాల సమర్పణ చేసి నైవేద్యాలు సమర్పించి దీపారాధనలు జరపడం జరిగినది.  అనంతరం ఆలయం లోపల ఉన్న విఘ్నాలు తొలగించే విజ్ఞేశ్వర స్వామికి ఆయురారోగ్యాలు ప్రసాదించే సుబ్రహ్మణ్యం స్వామికి వాయులింగేశ్వర స్వామికి   తల్లి జ్ఞాన ప్రసూనాంబ అమ్మవార్ల మూలవిరాట్లకు పవిత్ర మాలల సమర్పణ కార్యక్రమం అత్యంత వేడుకగా సాంప్రదాయ పద్ధతిలో వేదమంత్రోచ్ఛారణల నడుమ  వైభవంగా జరిపారు. యాగశాల లో విశిష్ట పూజా ద్రవ్యాలతో శాంతి హోమం పూజలు తదుపరి చండికేశ్వర స్వామి వారికి  మరియు  పూజా ద్రవ్యాలతో అభిషేకాలు సమర్పించి మాలధారణ జరిపి పవిత్రోత్సవాలు అత్యంత వైభవంగా ముగింపు చేశారు.

 ఈ సందర్భంగా దేవస్థానం ధర్మకర్తల మండలి  చైర్మన్ అంజూరు శ్రీనివాసులు మాట్లాడుతూ భాద్రపద ఏకాదశి నాడు శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానంలో ప్రారంభమైన పవిత్రోత్సవాలు  నేడు పౌర్ణమితో శాస్త్రయుక్తంగా, విజయవంతంగా పూర్తయ్యాయని తెలియజేశారు. ప్రతి ఏడాది కూడా శ్రీకాళహస్తి దేవస్థానంలో పవిత్రోత్సవాలు ఉత్సవాలు జరపడం ఆనవాయితీగా వస్తుందని అయితే ఈ ఏడాది పవిత్రోత్సవాలు ఎంతో కన్నులు పండుగుగా, అత్యంత వైభవంగా  ధర్మకర్తల మండల సభ్యులతో, ప్రత్యేక ఆహ్వానితులతో, దేవస్థానం  అధికారులతో ముఖ్యంగా ఆలయ ప్రధాన పూజారిన స్వామినాథం గురువుగారు, నీచు స్వామి, అర్ధగిరి స్వామి,తేజ స్వామి, కరుణాకర్ స్వామి,నిరంజన్ గురుకుల్, వరద గురుకుల్, వేద పండితులు అర్ధగిరి, ఆంజనేయ శర్మ,  శ్రీనివాసులు గురుకుల్, గోవిందు స్వామి మరియు వారి బృందం ఈ పవిత్ర ఉత్సవాలను ఎంతో పవిత్రంగా నియమ నిష్ఠలతోజరపడం చెప్పడం చాలా సంతోషకరం అని తెలియజేశారు. ఈ పవిత్ర ఉత్సవం కమిటీ ఉద్దేశం తెలుసో తెలియకో దేవాలయం  లోపల గాని, బాహ్యంగా గాని చేసే పూజలలో ఎటువంటి లోపాలు ఉన్న ప్రాయచ్చితంగా పూజలు నిర్వహిస్తారు. దానిని అపవిత్రోపవిత్రః హా అని, ఎటువంటి దోషం లేకుండా మమ్మల్ని క్షమించు అని, ఈ క్షేత్రంలో పవిత్రోత్సవం చాలా అరుదైనదని దేవదామూర్తులనే కాకుండా దేవాలయం అంతర్భాగంలోనే కాకుండా గోపురం వెలుపలి మరియు పైభాగాన ఆకాశ వినాయక స్వామి మరియు స్వామి అమ్మవార్ల గోపురాల శిఖరాలకు కూడా పవిత్ర ఉత్సవాళ్లు జరుపబడతాయి. ఈ ఏడాది మన క్షేత్రంలో పవిత్ర ఉత్సవాలు మొదలుపెట్టినప్పుడు నుండి వర్షాలు కూడా బాగా కురవడం ఎంతో సంతోషదాయకం అని, అలాగే ఈ ప్రాంతంలోని ప్రజలందరూ సస్యశ్యామలంగా ఆయురారోగ్యాలతో ఉండాలని మరియు ఈ పవిత్ర ఉత్సవాల్లో ఎవరైతే బాగమయి సహాయ సహకారాలు అందించారో అందరికి కూడా తల్లి జ్ఞాన ప్రసూనంబా సమేత వాయు లింగేగేశ్వరుని చల్లని దీవెనలు ఎల్లవేళలా అందరికీ ఉండాలని  కోరుకున్నారు.


 ఈ పూజాది కార్యక్రమంలో ఆలయ అధికారులు Ac మల్లికార్జున ప్రసాద్,ఆలయ డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి,  ధర్మకర్తల మండలి సభ్యులుసాధన మున్న రాయల్, బుల్లెట్ జయశ్యామ్,మహీధర్ రెడ్డి, పసల సుమతి, కొండూరు సునీత, రమాప్రభ, లక్ష్మి, ప్రత్యేక ఆహ్వానితులుజూలకంటి సుబ్బారావు, చింతామణి పాండు, పవన్ కుమార్, పాలమంగం నీలా, శ్రీదేవి  మరియు నంద, చంద్ర పాలమంగళం రవి, సూరావారి సురేష్ కంట ఉదయ్ కుమార్, బాల గౌడ్, తేజ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad