శ్రీకాళహస్తీశ్వరుని ఆశీర్వాదాలతో "14వ శతాబ్దం ముందు" నాటి చరిత్రకు మెరుగులుదిద్దించిన MLA బియ్యపు మధుసూదన్ రెడ్డి .
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
మరో 100 ఏళ్లకు శ్రీకాళహస్తి దేవస్థానంలోని ఆధ్యాత్మిక ఆధారాలను కాపాడగలిగాం.
మీ గ్రహదోషాలు విముక్తి కోసం తప్పనిసరిగా రాశిచక్రంను దర్శించండి.
జ్ఞాన ప్రసూనాంబికా దేవి తల్లి ముందరన్న రాశిచక్రంను పునరుద్ధరణ చేయడం మా జన్మధన్యం.
MLA బియ్యపు మధుసూదన్ రెడ్డి
ఐశ్వర్య ప్రధాత,విజ్ఞాన ప్రధాత, ఇహపర సుఖప్రధాత ఐన విశ్వేశ్వరుని ఆశీస్సులుతో శ్రీకాళహస్తి MLA జ్ఞానప్రసూనాంబ అమ్మవారి ఉపరి తలపై భాగాన "రాశి చక్రాల పునరుద్దరణ "చేశారు
సద్యో మూర్తి భాస్కర క్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయంలో స్వామివారు రాహు మరియు నవగ్రహ కవచ భూషణదారిగా అమ్మవారు కేతు భూషణదారిగా స్వయంభువ వెలసి ఉన్నారు.
శ్రీకాళహస్తి క్షేత్రానికి విచ్చేసే భక్తులు వారి గ్రహదోషాలు పోవాలన్న స్వామి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత గ్రహదోషాల విముక్తి కోసం తప్పనిసరిగా అమ్మవారి ముందర నిలబడి ప్రకారంపైన గల రాశిచక్రంను చూస్తూ తమ దోషాలు పోవాలని అమ్మవారిని సేవించడం దశాబ్దల కాలంగా ఆనవాయితీగా వస్తుంది.
అయితే ఆలయంలో కాలుష్యంతో ఆ చిత్రాలన్నీ చిత్రమైపోయాయి, దీంతో ఎమ్మెల్యే దానిపైన ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నిపుణులైన కళాకారును పిలిపించి ఆర్గానిక్ రంగులతో చిత్రీకరించాలని చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు గారికి మరియు ఈవో సాగర్ బాబు గారికి ఆదేశాలిచ్చారు.
దీంతో వారు వెంటనే కళాకారులను పిలిపించి అతి తక్కువ కాలంలో ఆ పురాతన చిత్రాలను మెరుగులు దిద్ది నేడు ఆలయ పేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ,అమ్మవారి ముందు ఉన్న రాశి చక్రాలను ఇంత అందంగా తీర్చిదిద్దిన కళాకారులను మరియు దేవస్థానం చైర్మన్ & ఈవో ని అభినందించారు.శ్రీకాళహస్తి ఆలయం యొక్క ప్రతిష్ట సంస్కృతి సాంప్రదాయాలు మనం రక్షించుకోవాలని దానికి ప్రతి ఒక్కరు సమిష్టిగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.అలాగే రాజకీయాలకు సంబంధం లేకుండా శ్రీకాళహస్తి దేవస్థానం అభివృద్ధి కొరకు ఎవరు ఏ సూచనలు ఇచ్చినా దానిపైన పరిశీలించి తప్పక అమలు చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి దేవస్థానం బోర్డు సభ్యులు మరియు పట్టణ వైఎస్ఆర్సిపి నాయకులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment