శ్రీకాళహస్తి చుట్టుపక్కల మండల ప్రజలకు త్వరితగతిన న్యాయ సేవలు అందించాలని తెలిపిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జ్ విజయలక్ష్మి
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్నంలో ఈరోజు అడిషనల్ డిస్టిక్ మరియు సెషన్ కోర్టును ప్రారంభించారు. ఈ కార్యక్రమమునకు ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జ్ మరియు చిత్తూరు జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జ్ కొంగర విజయలక్ష్మి, చిత్తూర్ ప్రిన్సిపాల్ జిల్లా జడ్జ్ భీమారావు, శ్రీకాళహస్తి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మాడుపూరు ప్రసాద్ మరియు చిత్తూర్, తిరుపతి సీనియర్,జూనియర్ జడ్జిలు మరియు న్యాయవాదులు, శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి మరియు పట్టణ ప్రముఖులు, శ్రీకాళహస్తి బార్ అసోసియేషన్ సభ్యులు, కోర్ట్ సిబ్బంది... మొదలైన వాళ్ళు పాల్గొన్నారు.
ముందుగా విజయవాడ, ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు నుంచి వర్చువల్ పద్ధతిలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిస్రా గారి చేతులమీదుగా శ్రీకాళహస్తిలోని అడిషనల్ జిల్లా మరియు సెషన్ కోర్టును ప్రారంభించారు.
అనంతరం న్యాయమూర్తులు మాట్లాడుతూ.... గౌరవ చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా గారి సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు .శ్రీకాళహస్తి పట్టణ చుట్టుపక్కల మండల ప్రజలకు ఇది ఒక సువర్ణ అవకాశము, ప్రజల అందుబాటులో న్యాయవ్యవస్థ ఉన్నందున ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని తెలిపారు. పెండింగ్ కేసులు త్వరతగతిన పూర్తి చేసుకోవాలని తెలిపారు.
No comments:
Post a Comment