ఉపాధ్యాయులను సత్కరించిన : అంజూరు తారక శ్రీనివాసులు - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, September 5, 2022

ఉపాధ్యాయులను సత్కరించిన : అంజూరు తారక శ్రీనివాసులు

 ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులను సత్కరించిన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ : అంజూరు తారక శ్రీనివాసులు






డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా నిర్వహించే ఉపాధ్యాయ దినోత్సవమును శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు   ఉపాధ్యాయులను మరియు తనదైన శైలిలో 15 మంది ఉపాధ్యాయులకు  గౌరవంగా సన్మానించి వారి వద్ద నుండి ఆశీస్సులను పొందారు.

శ్రీకాళహస్తి భరద్వాజ తీర్థం నందుగల పాఠశాల ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు మరియు  శ్రీకాళహస్తి పట్టణంలోని  విశ్రాంత  మరియు సీనియర్ ఉపాధ్యాయులైన  స్వర్ణ మూర్తి, పసల రమణయ్య, గాలి సుధాకర్ రెడ్డి, సుబ్బయ్య హేమ కుమార్ ప్రసూన నాయుడు, అరుణ, ఎల్.వెంకటరమణ, నీలిమ భాయ్, మురళి, వెంకట మునిరెడ్డ గార్లను శ్రీకాళహస్తిశ్వర స్వామి వారి శేష వస్త్రాలతో సత్కరించి స్వామి అమ్మవార్ల చిత్రపటాలను మరియు తీర్థప్రసాదాలను అందజేసి వారి వద్ద ఆశీర్వచనాలను పొందారు.

 ఈ సందర్భంగా సన్మాన గ్రహీతలు మాట్లాడుతూ... ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ఉపాధ్యాయ వృత్తి యొక్క ప్రాముఖ్యత తెలిసిన శ్రీకాళహస్తి దేవస్థానం చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు అటు విద్యాపరంగా, రాజకీయపరంగా ఎదుగుతూ అలాగే ఎంతో మందిని వారి ద్వారా విద్యార్థులకు మరియు వారి శిష్యులకు విద్యా బుద్ధులు నేర్పుతున్నారని అనేక రంగాలలో అభివృద్ది పరుచుతున్నారని అలాగే ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని తమని సత్కరించడం ఆనందంగా ఉంది అంటూ కృతజ్ఞతలు తెలియజేశారు.

 శ్రీకాళహస్తి దేవస్థానం పాలకమండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు. మాట్లాడుతూ ప్రతివ్యక్తి సమాజంలో ఎంత ఉన్నత స్థాయిలోఉన్నా దానికి మొదట నాంది పలికింది ఉపాధ్యాయులేనని  అన్నారు. తమ శిష్యులు అంత స్థానాల్లో మంచి విజయాలు సాధించినప్పుడే గురువుకి వేటి వల్ల లభించినంత సంతోషం కలుగుతుందని గురువుల యొక్క గొప్పతనం గురించి  తెలియజేశారు.

 ఈ కార్యక్రమంలో మొగరాల గణేష్, కోళ్లూరు హరినాథ్ నాయుడు, బాల గౌడ్, కళ్యాణ్, కామెష్, సూరి, తేజ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad