బూడిదమిట్ట మార్గం లో విద్యుత్ స్తంభాలు తొలగింపు
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తి ఆలయ ప్రాంగణంలోని శ్రీ జ్ఞాన ప్రసూనాంబ అతిథి గృహం నుంచి బూడిది మిట్ట లోకి గతంలో ఉన్న దారిని పునరుద్ధరించి ట్రాఫిక్ ఇక్కట్లు తొలగించే విధంగా దారి ఏర్పాటుకు దేవస్థానం చైర్మన్ అంజూరు శ్రీనివాసులు ఇంజనీరింగ్, విద్యుత్ శాఖ అధికారులతో కలిసి పరిశీలన చేశారు. దారి ఏర్పాటుకు విద్యుత్ స్తంభాలు అడ్డుగా ఉండడంతో విద్యుత్ శాఖ అధికారులతో సంప్రదించారు. స్పందించిన అధికారులు దేవస్థానం విజ్ఞప్తి మేరకు అడ్డుగా ఉన్న విద్యుత్ స్తంభాలు యుద్ధ ప్రతిపాదికంగా తొలగింపు పనులు చేపట్టారు. దీంతో బూడిద మిట్ట మార్గాన్ని పునరుద్ధరించే పనులు చేపట్టాలని ఇంజనీరింగ్ సిబ్బంది నీ చైర్మన్ అంజూ రు శ్రీనివాసులు ఆదేశించారు. రోజు రోజుకు ఆలయానికి పెరుగుతున్న వాహనాల రద్దీని నియంత్రించే విధంగా వాహనాలను ఇకపై బూడిద మిట్ట మార్గం నుంచి లో బావి కి పంపించే విధంగా చర్యలు చేపడుతున్నట్లు చైర్మన్ అంజూర్ శ్రీనివాసులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో దేవస్థానం డి ఈ మురళీధర్, ADE సతీష్ రెడ్డి, విద్యుత్ శాఖ ఏఈ చెంచు కృష్ణయ్య, గంగాధర్ మరియు కంఠా ఉదయ్ కుమార్, బాల గౌడ్, సునీల్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment