ముత్యాలమ్మ గుడి వీది శ్రీ సంకల్ప సిద్ధి వినాయక హోమము ముఖ్య అతిథిగా అంజూరు తారక శ్రీనివాసులు - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, September 3, 2022

ముత్యాలమ్మ గుడి వీది శ్రీ సంకల్ప సిద్ధి వినాయక హోమము ముఖ్య అతిథిగా అంజూరు తారక శ్రీనివాసులు

 ముత్యాలమ్మ గుడి వీది  శ్రీ సంకల్ప సిద్ధి వినాయక  హోమము  ముఖ్య అతిథిగా అంజూరు తారక  శ్రీనివాసులు





స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :


ఈరోజు భాద్రపద శుద్ధ సప్తమి పుణ్యవతి సందర్భంగా మరియు  శ్రీ గణేశ పంచదిన ఉత్సవాల్లో భాగంగా స్థానిక ముత్యాలమ్మ గుడి వీది లోని శ్రీ సంకల్ప సిద్ధి వినాయక మండపం నందు మహా గణపతి హోమము శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ హోమము యొక్క పూర్ణాహుతి నందు శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం చైర్మన్  అంజూరు తారక  శ్రీనివాసులు  ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. హోమము అనంతరం కార్యక్రమం యొక్క నిర్వాహకులు ఛైర్మెన్ గారిని శ్రీ స్వామి వారి శేష వస్త్రం తో సత్కరించగా, ఛైర్మెన్  కార్యక్రమ నిర్వాహకులను కండువాలతో సత్కరించారు.

తదనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం ను ప్రారంభించి, స్వయంగా వడ్డన చేశారు. ఈ సందర్భంగా ఛైర్మెన్  మాట్లాడుతూ, శ్రీ కాళహస్తి క్షేత్రం లో అనుబంధ ఆలయములు చాలా ఉన్నాయని, వాటితో పాటుగా ఇలా ఊరు మొత్తం వినాయక మండపలను ఏర్పాటు చేసి ధార్మిక కార్య్రమాలు చేయడం చాలా ఆనందంగా ఉందని , ఇలాగే అనేక ధార్మిక కార్యక్రమాలు ఊరి ప్రజలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ  కార్య్రమములో మల్లిఖార్జునయ్య, బాల గౌడ్, తేజు, సునీల్, తేజ మరియు స్థానికంగా ఉన్న  మహిళలు విశేషంగా పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad