నిత్య అన్నదానం తనిఖీ చేసిన అంజూరు తారక శ్రీనివాసులు
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తి ఆలయంలో నిత్య అన్నదాన పథకం అమలు తీరును శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు పరిశీలించారు. నిత్యాన్నదాన మండపానికి వెళ్లి ఆహార పదార్థాల నాణ్యతలను పరిశీలన చేశారు. అనంతరం భక్తులను అన్న ప్రసాదం ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. అన్నప్రసాదాలు రుచి, ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయని భక్తులను ఆరా తీశారు. అన్న ప్రసాదాలు చాలా బాగున్నాయి అని భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు.
నిత్యాన్నదానికి వచ్చే భక్తుల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ అడిగిమరీ వడ్డింపులు చేయాలని సిబ్బందికి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు సూచించారు. భోజనంలో చిన్న బిడ్డలు ఉంటే వారు నెమ్మదిగా తినేంతవరకు వేచి ఉండి అన్న ప్రసాదాలు ఓపిగ్గా అందించాలని, ఎవరి పట్ల కూడా దురుసుగా వ్యవహరించరాదని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అన్నదానం ఇంచార్జ్ దామోదరం మరియు సిబ్బంది పాల్గొన్నారు.
No comments:
Post a Comment