అత్యాచారాంధ్రప్రదేశ్ గా మార్చేసిన వైసీపీ సర్కార్ : చక్రాల ఉష - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, September 9, 2022

అత్యాచారాంధ్రప్రదేశ్ గా మార్చేసిన వైసీపీ సర్కార్ : చక్రాల ఉష

 అత్యాచారాంధ్రప్రదేశ్ గా మార్చేసిన వైసీపీ సర్కార్ : చక్రాల ఉష


స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :

రోజుకో ఆడబిడ్డ బలవ్వుతూ ఉంటే ప్రభుత్వం మత్తు వీడదా

 బాలికకు గర్భం చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారిపై చర్యలు తీసుకోండి

-టీడీపీ తిరుపతి పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు చక్రాల ఉష

తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో 13ఏళ్ల బాలికకు గర్భం చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని తిరుపతి పార్లమెంటు మహిళా  అధ్యక్షురాలు చక్రాల ఉష డిమాండు చేశారు. అదేవిధంగా పంచాయితీ నిర్వహించిన వైసీపీ నేతపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు ఆమె గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. వెంకటగిరిలో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి తన ఇంట్లో పని చేసే ఓ బాలికను భయంతో లొంగదీసుకుని పలు పర్యాయాలు అత్యాచారం చేశాడన్నారు. ఫలితంగా ఆ బాలిక గర్భవతి అయిందన్నారు.  బాలిక శరీరంలో మార్పులు గమనించి ఆమె తల్లిదండ్రులు ఆరా తీయడంతో అసలు విషయం వెలుగు చూసిందన్నారు. ఈ విషయం బయటకు పొక్కకుండా ఉండటానికి వెంకటగిరికే చెందిన వైసీపీ చోటా నేత పంచాయతీ నిర్వహించారన్నారు. బాలికకు పరిహారం పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారి నుంచి రూ.15లక్షలు వసూలు చేశారని చక్రాల ఉష తెలిపారు. ఈ సొమ్ములో కేవలం రూ.2లక్షలు మాత్రమే బాధితురాలి కుటుంబ సభ్యులకు ఇచ్చి... మిగిలిన రూ.13లక్షలు వైసీపీ నేత నొక్కేశారని చక్రాల ఉష ఆరోపించారు. బాలిక కుటుంబీకులు పేదవారు కావడం... పలుకుబడి లేక పోవడంతో వారిని వైసీపీ నేత బెదిరింపులకు గురి చేస్తున్నాడని ఆమె చెప్పారు. బాలిక కుటుంబీకులను బెదిరించి ఆమెకు గర్భస్రావం కూడా చేసినట్లు తమకు సమాచారం వచ్చిందన్నారు. ఒక దశలో బాలిక కుటుంబీకులు పోలీసులను ఆశ్రయించడానికి ప్రయత్నించగా వైసీపీ నేత అడ్డుకుని వారిని బెదిరించారన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళలకు రక్షణ కరువైందన్నారు. బాలికకు న్యాయం చేయవలసిన వారే పంచాయితీ పేరుతో సొమ్ము నొక్కేయడం ఎంత వరకు న్యాయమన్నారు. వైసీపీ నేతలు ఎలాంటి నీచపు పనులు చేస్తున్నారో వెంకటగిరిలో జరిగిన ఘటన ఒక ఉదాహరణ మాత్రమేనని చక్రాల ఉష అన్నారు. బాలికపై అత్యాచారం చేసి గర్భవతి చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారిపై పోక్సో చట్టం కింద నమోదు చేసి అరెస్టు చేయాలని ఆమె డిమాండు చేశారు. అదేవిధంగా పంచాయితీ నిర్వహించి రూ.13లక్షలు నొక్కేసిన వైసీపీ నేతపై కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవాలన్నారు. లేదంటే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని చక్రాల ఉష హెచ్చరించారు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad