త్వరలో తిరుపతి ఇంటర్ మోడల్ స్టేషన్ నిర్మాణం
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
తిరుపతిలో గురువారం తిరుపతి, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని పలు జాతీయ రహదారుల పనులను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో తిరుపతి జిల్లాలోని చిల్లకూరు క్రాస్ నుంచి తూర్పు కనుపూరు నాలుగు లైన్ల రహదారి; తూర్పు కనుపూరు నుంచి కృష్ణపట్నం పోర్ట్ దక్షిణ గేట్ వరకు 6 లైన్ల రహదారి నిర్మిస్తారన్నారు. ఈ రెండింటి నిర్మాణాలకు కృష్ణపట్నం పోర్ట్ ప్యాకేజి -II ద్వారా రూ.909.24 కోట్లు వెచ్చించనున్నట్టు ఎంపీ తెలిపారు.
తమ్మినపట్నం నుండి నారికేళ్ళపల్లి వరకు నాలుగు లైన్ల రహదారి నిర్మాణం (NH-516) , ప్రత్యేకంగా పోర్ట్ రహదారి నిర్మాణం కోసం 6 లైన్ల రహదారి (NH-67) నిర్మాణాలకు కృష్ణపట్నం పోర్ట్ ప్యాకేజి -III ద్వారా రూ.609.73 కోట్లు వెచ్చించనున్నారు.
నాయుడుపేట నుంచి తూర్పు కనుపూరు వరకు 6 లైన్స్ రహదారి నిర్మించనున్నారు. ఈ రహదారి నిర్మాణం కృష్ణపట్నం పోర్ట్ ప్యాకేజి - IV ద్వారా రూ.1398.84 కోట్లు వెచ్చించనున్నారు.
ప్రత్యేకంగా పోర్ట్ కనెక్తివిటీ పెంచేందుకు కృష్ణపట్నం పోర్ట్ ప్యాకేజి - I ద్వారా రూ.254.43 కోట్లతో 6 లైన్ల రహదారి నిర్మాణం చేపడతారు.
రేణిగుంట నుండి నాయుడుపేట వరకు రూ.2238 కోట్లతో 6 లైన్ల జాతీయ రహదారి నిర్మాణం (NH 71)
నెల్లూరు పట్టణం నుండి కృష్ణ పట్టణం పోర్ట్ వరకు రూ.695 కోట్లతో కృష్ణపట్నం పోర్ట్ ప్యాకేజి - V ద్వారా నాలుగు లైన్ల రహదారి నిర్మాణం
ఇలా అడిగిన వెంటనే రూ.6105.24 కోట్లు రహదారుల నిర్మాణానికి , అలాగే రూ.400 కోట్లతో తిరుపతిలో ఇంటర్ మోడల్ స్టేషన్ కూడా మంజూరు చేసి తన పెద్ద మనసు చాట్టుకొన్నారని ఎంపీ డాక్టర్ గురుమూర్తి తెలిపారు. ఈ ఘనత కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారికి చెందుతుందని తిరుపతి పార్లమెంట్ పరిధిలోని ప్రజల తరపున ఆయనకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియ జేసారు
No comments:
Post a Comment