సబ్ జైలు ను సందర్శించడం ఎమ్ఎస్ భారతి, చిత్తూరు జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీ కం సీనియర్ సివిల్ జడ్జ్
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
హైకోర్టు మరియు ఆంధ్రప్రదేశ్ లీగల్ సర్వీస్ అథారిటీ ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లా పరిధిలో ఉన్న అన్ని జైలును సందర్శించి, వచ్చేనెల జులై 5న తేదీ జరుగు జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం విజయవంతం చేయాలని అవగాహన కల్పించుటకు.ఈ సందర్భంగా సబ్ జైల్లో తులసి మొక్కను నాటారు.ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీకాళహస్తి పట్టణంలోని సబ్ జైలును సందర్శించడం జరిగింది. జైలు రూమ్ లోని పరిశుభ్రత , వంటశాల, స్టోర్ రూమ్, బాత్రూంలను పరిశీలించారు. ప్రతి ఖైదీలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో సబ్ జైల్ సుపర్డెంట్ శ్రీకాంత్, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, పారా లీగల్ వాలంటరీలు పాల్గొన్నారు.న్యాయమూర్తి భారతి మాట్లాడుతూ... ప్రతి ఒక్క రిమాండ్ ఖైదీలకు తప్పక చట్టం పై అవగాహనా కలిగివుండాలి అన్నారు. అలాగే బెయిల్ గురించి మరియు ఉచిత న్యాయం, న్యాయ చట్టం...మొదలైన చట్టాలపై అవగాహనా కలిగి ఉండాలని తెలిపారు. మీ పరిసరప్రాంతాలు పరిశుబ్రముగా ఉండాలని తెలిపారు. మీకు ఏ సమస్యవున్న ఒక అర్జీ రూపంలో ఇచ్చినచో మీ సమస్య పరిష్కరించుటకు ప్రయత్నిస్తామని తెలిపారు.అలాగే రాబోవు జులై 5నతేది జాతీయ లోక్ అదాలత్ విజయవంతం చేయాలని కక్ష దారులకు, న్యాయవాదులకు తెలిపారు
No comments:
Post a Comment