శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం లో హనుమాన్ జయంతి
స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి:
శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం లో హనుమాన్ జయంతిని పురస్కరించుకొని శ్రీకాళహస్తి దేవస్థానంలోని అచ్యుతరాయ మండపము నందు వెలసివున్న హనుమంతుని అర్చకులు దరభ తులసి మరియు అధాగ్రిరి శ్రీ వచ్చా వేదమంత్రాలతో విగ్రహానికి వివిధ రకాల సుగంధ జలాలతో అభిషేకాలు నిర్వహించి ధూప దీప నైవేద్యాలు సమర్పించి స్వామివారి సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ శ్రీ అంజూరుతారక శ్రీనివాసులు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే కుమార్తె బియ్యపు పవిత్ర రెడ్డి మరియు భక్తులు పాల్గొని స్వామివారి దివ్యమంగళ రూపాన్ని దర్శించి స్వామివారి కృపాకటాక్ష పాత్రులయ్యారు.ఈ కార్యక్రమంలో ఆలయ AC మల్లికార్జున గారు టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్ ఆలయ అధికారులు మరియు వైఎస్సార్సీపీ నాయకులు కొండూరు నంద, నరసింహులు, కళ్యాణ్, బాల, తేజ. పాల్గొన్నారు.
No comments:
Post a Comment