మరో గంటలో పెళ్లి... వరుడు మృతి... మరో వ్యక్తితో వధువు కి మూడు ముళ్ళు - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, May 24, 2022

మరో గంటలో పెళ్లి... వరుడు మృతి... మరో వ్యక్తితో వధువు కి మూడు ముళ్ళు

 మరో గంటలో పెళ్లి... వరుడు మృతి... మరో వ్యక్తితో వధువు కి మూడు ముళ్ళు


నిన్న వైజాగ్…. నేడు కర్నూలు..పీటల మీద పెళ్లిళ్లు ఆగిపోయాయి. మరికాసేపట్లో పెళ్లి జరగాల్సి ఉండగా వరుడు మృత్యువాత పడ్డాడు. తల్లడిల్లి పోయిన పెళ్లి కూతురు & తల్లిదండ్రులు….


అదే ముహూర్తానికి బంధువుల తరపు అబ్బాయి కి ఇచ్చి వివాహం జరిపించారు. మరికాసేపట్లో పెళ్లిపీటలపై వధువు మెడలో మూడుముళ్లు వేయాల్సిన వరుడు మృత్యువాత పడటంతో...       


ఆ పెళ్లికూతురు ముఖం కళతప్పింది..ఆమె దుఃఖాన్ని చూసి అందరూ కంటతడి పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఏపీలో రోజుల వ్యవధిలోనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవటం కలకలం రేపింది..   



తాజాగా కర్నూలు జిల్లాలో జరిగిన ఘటన పూర్తి వివరాలు పరిశీలించగా…


కర్నూలు జిల్లా పెద్ద కడుబూరు మండలం చిన్న తుంబలం గ్రామానికి చెందిన అబ్దుల్ హమీద్ పదవ తరగతి వరకు చదువుకున్నాడు..స్వగ్రామంలోనే ఎలక్ట్రిషన్ గా పని చేస్తున్నాడు. అబ్దుల్‌ హమీద్‌కు హోళగుంద మండలం gajjehalli గ్రామానికి చెందిన నూర్ ఏ చెస్ అనే యువతితో పెళ్లి ఖాయమైంది… మే 22న నిఖా జరగాల్సి ఉంది. పెళ్లి జరిపించేది పెళ్లికూతురు తరపువారే కాబట్టి పెళ్ళికొడుకు, వారి బంధువులు అందరూ గత రాత్రి పెళ్లికూతురు ఊరు అయిన gajjehalli కి చేరుకున్నారు. రాత్రి చిన్నపాటి ఫంక్షన్ కు రెడీ అయ్యారు. అంతలోనే కడుపులో నొప్పిగా ఉందంటూ చెప్పాడు వరుడు. నొప్పి మరింత ఎక్కువ కావడంతో సమీప సిరిగుప్ప ఆసుపత్రికి తరలించారు బంధువులు. కానీ, పాపం కోలుకోలేక పెళ్లి కుమారుడు అబ్దుల్‌ హమీద్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. కరెక్ట్ గా పెళ్లి జరగాల్సిన సమయానికి గంట ముందే మృత్యువాత పడ్డాడు. రాత్రి నుంచి తర్జనభర్జన లో ఉన్న పెళ్లి కూతురు తల్లిదండ్రులు, బంధువులు పెళ్లి కుమారుడు ఆస్పత్రి నుంచి కోలుకుని రావాలని కోరుకున్నారు. ఎందుకైనా మంచిది అనే ఉద్దేశంతో అదే ముహూర్తానికి బంధువుల అబ్బాయి తో మాట్లాడుకుని పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. దురదృష్టవశాత్తూ పెళ్ళికొడుకు మృతిచెందడంతో ముందుగా అనుకున్న దాని ప్రకారం హోళగుంద మండలం వందవగిలి గ్రామానికి చెందిన నబి రసూల్ తో పెళ్లి చేశారు. నబి రసూల్ పెళ్ళికి అంగీకరించడం, పుట్టెడు దుఃఖంలో ఉన్న పెళ్లి కూతురు కూడా ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా అంగీకరించడంతో, బంధువులంతా ఏకమై పెళ్లి చేయడం చకచకా జరిగిపోయాయి. మృతి చెందిన పెళ్ళికొడుకు ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad