మూగజీవుల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత మనందరిది బియ్యపు మధుసూదన్ రెడ్డి - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, May 25, 2022

మూగజీవుల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత మనందరిది బియ్యపు మధుసూదన్ రెడ్డి

 అత్యవసర పశు వైద్యం కోసం 1962





స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి: 


అత్యవసర పరిస్థితుల్లో  మూగజీవుల వైద్యం కోసం 1962కు ఫోన్ చేసి వాటి ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి గారు అన్నారు.   


శ్రీకాళహస్తి నియోజకవర్గానికి మంజూరైన "డాక్టర్ వై.ఎస్.ఆర్ సంచార పశు ఆరోగ్య సేవ" వాహనాన్ని గోపూజ చేసి ప్రారంభించారు ఎమ్మెల్యే గారు. 


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా వాహనంలోనే హైడ్రాలిక్ పద్ధతిలో అనారోగ్య పశువును రైతుల ఇంటి వద్ద నుంచి మెరుగైన చికిత్స కోసం తరలించే సౌకర్యాన్ని  ప్రవేశపెట్టి ముఖ్యమంత్రి వై. యస్, జగన్మోహన్ రెడ్డి గారు మూగ జీవుల ప్రాణదాత అయ్యారన్నారు. జగనన్న ప్రజలకే కాక మూగజీవాలు సైతం తన సేవలు అందిస్తున్నారని జగనన్నకు ధన్యవాదాలు తెలియజేశారు.

  

పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ N.V శ్రీకాంత్ బాబు మాట్లాడుతూ వాహనంలో ఒక పశు వైద్యుడు, వెటర్నరీ డిప్లొమా చేసిన పశువైద్య సహాయకుడు డ్రైవర్ తో బాటు ఉంటారన్నారు. 54 రకాల వివిధ పరికరాలు 81 రకాల మందులు అందుబాటులో వుoటాయన్నారు. ఒక ప్రత్యేక ప్రణాళికతో ఈ వాహనాన్ని నియోజకవర్గంలోని అన్ని రైతు భరోసా కేంద్రాలకు అందుబాటులో వుoచుతామన్నారు.రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.


ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తీశ్వరయ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు, మార్కెట్ కమిటీ చైర్మన్ వయ్యాలకృష్ణారెడ్డి, రేణిగుంట AD డాక్టర్ సునీత, మొబైల్ డాక్టర్ వెంకటయ్య పశువైద్యలు గోపీనాథ్, శిల్పారెడ్డి, కృష్ణ, గుణశేఖర్, పలువురు సిబ్బంది మరియు వైఎస్ఆర్ సీపీ నాయకులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad