అంగరంగ వైభవంగా జరిగిన వివిధ దేవాలయాల మహా కుంభాభిషేకం
స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి:
తిరపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని వివిధ దేవాలయాల్లో అంగరంగ వైభవంగా మహాకుంభాభిషేకం కార్యక్రమం జరిగింది. శ్రీకాళహస్తి పట్టణంలోని పానగల్ లో వెలసిన పొన్నాలమ్మ గుడి, బహదూర్ పేట ఉప్పు వీధి లో వెలసిన శ్రీ కన్యకా పరమేశ్వరి గుడి, విశ్వ బ్రాహ్మణ వీధిలో బ్రహ్మంగారి గుడి మరియు తొట్టంబేడు మండలం లోని శ్రీ షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి లో మహాకుంభాభిషేకం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం లో శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి మరియు శ్రీకాళహస్తి దేవస్థానం చైర్మన్ అంజూరు శ్రీనివాసులు మరియు ఆ ఆ ఆలయ కమిటీ మెంబర్లు మరియు అశేష భక్తులు పాల్గొన్నారు.
ఉదయం నుంచి గణపతి పూజ, నవగ్రహ హోమం, లక్ష్మీ హోమం క్షిరాదివాసం , శుద్ధి పూర్ణాహుతి, విగ్రహ ప్రతిష్ట, రక్షాబంధనం కలశస్థాపన, అగ్ని ప్రతిష్ట, మూలమంత్రం, చతుర్వేద మంత్రపుష్పం జరిగింది. అనంతరం గోపురం శిఖర మరియు మూలవిరాట్ లకు మహాకుంభాభిషేకం కార్యక్రమం జరిగింది. అశేష భక్తజనం పాల్గొని మహాకుంభాభిషేకం కనులారా తిలకించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు అలంకరణ, నైవేద్యం అందించారు. భక్తులకు దర్శనం అనంతరం తీర్థప్రసాదాలు మరియు అన్నదాన కార్యక్రమాలు జరిగినది.

.jpeg)


.jpeg)







No comments:
Post a Comment