మిద్దెల హరి యువసేన కార్యాలయం ప్రారంభించిన గౌరవ యువసేన అధ్యక్షులు మిద్దెల హరి - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, May 22, 2022

మిద్దెల హరి యువసేన కార్యాలయం ప్రారంభించిన గౌరవ యువసేన అధ్యక్షులు మిద్దెల హరి

  మిద్దెల హరి యువసేన కార్యాలయం ప్రారంభించిన గౌరవ యువసేన  అధ్యక్షులు మిద్దెల హరి 












    స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి:

  22-05-2022 వ తేదీన శ్రీకాళహస్తి పట్టణంలో ఉన్న నగిరి వీధి లోని సిద్ధార్థ  లాడ్జి  నందు మిద్దెల హరి యువసేన కార్యాలయమును దళిత, గిరిజన,బడుగు, బలహీనవర్గాల నాయకుడు వైఎస్ఆర్సిపి తిరుపతి జిల్లా బీసీ విభాగం అధ్యక్షుడు యువసేన గౌరవ అధ్యక్షులు మిద్దెల హరి గారు ప్రారంభించారు. అనంతరము అభిమానులు మిద్దెల హరి గారిని గజమాలతో, పూలమాలతో   దుశ్శాలువ తో ఘనంగా సత్కరించడం జరిగింది

      ఈ కార్యక్రమానికి విచ్చేసిన శ్రీకాళహస్తి వైఎస్ఆర్ సిపి పట్టణ మాజీ అధ్యక్షులు కొట్టేటి మధుగారు మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావం నుండి వైస్సార్సీపీ పార్టీ కోసం  తన సొంత ఖర్చుతో పార్టీని అభివృద్ధి చేశారు.శ్రీకాళహస్తి పట్టణంలో ఉన్న  చాలామంది పేద ప్రజలకు సబ్సిడీ లోన్లు  ఇచ్చిన ఘనత ఒక మిద్దెల హరి కీ మాత్రమే దక్కుతుంది అని తెలిపారు.  అలాంటి Bc నాయకుడికి ప్రభుత్వ పెద్దలు పార్టీ నాయకులు  న్యాయం చేయాలని డిమాండ్ చేశారు

       వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  మరియు రాష్ట్ర ముదిరాజ్ సంఘం ఉపాధ్యక్షులు  సురేంద్ర ముదిరాజ్ గారు మాట్లాడుతూ శ్రీకాళహస్తి నియోజవర్గంలో బీసీల జనాభా అధికంగా ఉన్నప్పటికీ వారి జనాభా ఆధారంగా రావాల్సిన పదవులు రావడం లేదని ఆవేదన చెందారు.  రాబోయే రోజుల్లో మిద్దెల హరి గారికీ బీసీలు అండగా నిలబడతామని తెలిపారు 

         గౌరవ యువ సేన అధ్యక్షులు మిద్దెల హరి మాట్లాడుతూ పార్టీ ysrcp ఆవిర్భావం 11 సంవత్సరములు పాటు పార్టీ అభివృద్ధి కోసం ఎక్కడా రాజీ పడకుండా కృషి చేశానని తెలిపారు . అంతేకాకుండా  రాబోవు రోజుల్లో ys జగన్మోహన్ రెడ్డి గారి అడుగుజాడల్లో నడుస్తూ పార్టీ అభివృద్ధికి  ఎక్కడా రాజీపడకుండా కృషి చేస్తానని తెలిపారు. . యువసేన కార్యాలయంలో పేద ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు

                   ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ పట్టణ BC సెల్ అధ్యక్షులు  ఆర్కడ్ శంకర్, మాజీ కౌన్సిలర్ జయ దేవన్ గిరి,   గౌరవ పెద్దలు లాయర్లు విప్పరపల్లి సాయి,మల్లికార్జున్ నాయుడు , k రమణయ్య గార్లు , యతిరాజులు,ఇసుక మట్ల బాల, దావాలా గిరి, బండి రమేష్, గంజి వెంకటేష్, ప్రభాకర్, సుధ,గాంధీ,N. వెంకటేష్,జగ్గా D.బాబు, D. సురేష్,కొమ్మల సాయి,కోటి, వినోద్, కళ్యాణ్, C. శివ,R సూరి, రవి, మరియు  విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు  చంద్ర, వెంకటేష్ రమేష్, కళ, ఇతర బీసీ కులాల సంఘాలు మరియు మిద్దెల హరి యువసేన సభ్యులు పాల్గొన్నారు

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad