గుడిమల్లం దేవస్థానం అభివృద్ధి సత్వర చర్యలు-ఎంపీ గురుమూర్తి
పలు శాఖల అధికారులతో విస్తృత చర్చలు
స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి:
క్రీస్తు పూర్వం 3వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయం చోళ మరియు పల్లవ రాజవంశస్తుల కాలంలో అద్భుతమైన శిల్పాకళా నైపుణ్యంతో నిర్మించబడి భక్తులను ఆకట్టుకొంటున్న ప్రముఖ ప్రఖ్యాత హిందూ దేవాలయమైన గుడిమల్లం ఈశ్వరుని దేవాలయం చాలా విశిష్టత కలిగిందని ఎంపీ గారు చెప్పారు.
ఈ పురాతనమైన ఆలయాన్ని సుందరీకరించే కార్యక్రమంలో భాగంగా ఆలయంలో నూతన శీతలీకరణ యంత్రాలను ఏర్పాటు చేయడం, శానిటేషన్, త్రాగు నీటి వసతి, మొదలగు అన్ని వసతులను ఏర్పాటు చేయడం, కోనేరు సుందరీకరణ, వంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసినట్లుయితే తద్వారా భక్తుల రద్దీ పెరిగి ఆలయం తోపాటుగా చుట్టు పక్కల ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయాని అన్నారు.
చర్చల అనంతరం ఎంపీ మాట్లాడుతూ త్వరలో అన్ని శాఖల అధికారులు కలిసి సమన్వయం చేసుకొని గుడిమల్లం దేవస్థానం సందర్శించి ఏ విదంగా అభివృద్ధి చేయాలి అని పరిశీలించి ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించామని తెలియజేసారు.
గుడి మల్లం ఆలయం అభివృద్ధి ప్రదాన అజెండాగా తిరుపతి ఎంపీ కార్యాలయంలో నిన్న, ఈరోజు జరిగిన సమావేశంలో ఏర్పేడు వైఎస్సార్ కాంగ్రెస్ ఇంచార్జి జి.కిషోర్ రెడ్డి, దేవాదాయ శాఖ, పురావస్తు శాఖ, స్థపతి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, పర్యాటక శాఖ ఎగ్జిక్యూటివ్ అండ్ రీజినల్ డైరెక్టర్ మరియు అన్ని శాఖల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్, అసిస్టెంట్ ఇంజనీర్స్, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment