అనంతపురం రేంజ్ డి.ఐ.జి ఎం.రవిప్రకాష్ IPS ఈరోజు తిరుపతి జిల్లా పోలీసు అధికారులతో జూమ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర డి.జి.పి శ్రీ రాజేంద్రనాథ్ రెడ్డి IPS గారు జారీ చేసిన ఆదేశాలను క్షేత్రస్థాయి సిబ్బందికి చేరేందుకు డి.ఐ.జి గారు ఈ కాన్ఫరెన్స్ నిర్వహించి దిశానిర్ధేశం చేశారు.
స్వర్ణముఖి న్యూస్, తిరుపతి:
ఈ సమావేశంలో తిరుపతి జిల్లా యస్.పి శ్రీ పి.పరమేశ్వర రెడ్డి, ఐ.పి.యస్ గారు మరియు అడిషనల్ యస్.పి లు జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులందరూ పాల్గొన్నారు.
కస్టోడియల్ హింసకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పోలీసు స్టేషన్లకు వచ్చే వారి పట్ల మర్యాదగా వ్యవహరించాలి.
పోలీస్ యూనిఫాం వేసుకున్న మనమే మహిళల పట్ల మోసాలు, ప్రేమ వ్యవహారాల జోలికిపోరాదు. పోలీసుశాఖ ప్రతిష్ట దిగజార్చకండి. చట్టం దృష్టిలో అందరూ సమానమని గుర్తెరగండి.
క్రైం అగనెస్ట్ ఉమెన్ ఘటనల్లో ముఖ్యంగా అత్యాచారం, హత్య కేసుల్లో తక్షణమే డీఎస్పీలు ఘటనా స్థలానికి వెళ్లాలి. తదుపరి తక్షణ చర్యలు తీసుకోవాలి.
అత్యాచారం, హత్య కేసులు తగ్గించేందుకు కృషి చేయాలి. ప్రజల్లో అవగాహన తేవాలి.
క్రైం అగనెస్ట్ ఉమెన్ ఘటనలు చోటు చేసుకోకుండా డీఎస్పీల నుండీ ఎస్పీల వరకు కళాశాలలకు వెళ్లి దిశ, ర్యాగింగ్ , మహిళా చట్టాలపై అవగాహన చేయాలి
మహిళలపై జరుగుతున్న కీలక కేసుల్లోని దర్యాప్తులలో తక్షణమే దిశ డీఎస్పీకు పంపడం ... నెలలోపే చార్జిషీటు దాఖలు చేయాలి
ఏవేని కేసుల్లో మైనర్లు, మహిళలు పాల్గొంటే వారిని పోలీసు స్టేషన్లకు తీసుకురాకండి. ఎవరైనా ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు. 41 crpc నోటీసులు ఇవ్వడమా లేదంటే 7 ఏళ్లపైన శిక్షలు పడే కేసుల్లో తక్షణమే అరెస్టు చేసి పంపాలి
ప్రెస్ మీట్లు సందర్భంగా పోలీసు సిబ్బంది, అధికారులు ఎవరైనా సరే యూనిఫాంలో ఉండాలి. చెప్పాల్సిన విషయాలు, అంశాలు కూలంకుషంగా చెప్పాలి.
పోలీసుశాఖకు చెడ్డపేరు తెచ్చే విధంగా వ్యవహరించడం గానీ అవినీతికి పాల్పడటం గానీ చేయరాదు
తిరుమలలో పిల్లల్ని ఎత్తుకెళ్లే కిడ్నాపర్ల ముఠాలపై ప్రత్యేక నిఘా వేయాలి. నిత్యం అప్రమత్తంగా ఉండాలి.
తిరుమలలో వేసవి వేళ అధికంగా భక్తులు వచ్చే అవకాశముంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
రైల్వే స్టేషన్లు, ప్లాట్ ఫాంలలో నేరాలు జరుగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి. నిఘా వేయాలి. సిసి కెమేరాలు పక్కాగా ఉండేలా చూసుకోవాలి. తరుచూ తనిఖీలు చేపట్టాలి. RPF, GRPF సిబ్బందిని సమన్వయం చేసుకుని చర్యలు చేపట్టాలి.
నాటు సారా కట్టడిపై చర్యలు తీసుకోవాలి. నాటు సారాకు పాల్పడే వారి పి.డి.యాక్టుల ప్రయోగం, బహిష్కరణలకు నిబంధనలు ప్రకారం ప్రతిపాదనలు పంపాలి.
బెల్లపు ఊట ధ్వంసం చేయడంతో పాటు తయారీకి పాల్పడుతున్న వారిని అరెస్టు చేయాలి. నల్లబెల్లం, అమ్మోనియం, తదితర పదార్థాల విక్రయదారులు, సరఫరాదారులపై దృష్టిపెట్టాలి.
గంజాయి కేసుల్లో కూడా అక్రమ రవాణాదారులే కాకుండా మూలాల్లోకి వెళ్లి సరఫరాదారులు, విక్రేతలు... ఇలా అందర్ని అరెస్టు చేయాలి
ఎర్రచందనంపై ప్రత్యేక నిఘా వేయండి. అక్రమ రవాణా జరుగకుండా చూడాలి.
No comments:
Post a Comment