గడపగడపకు మన ప్రభుత్వం" కార్యక్రమంలో భాగంగా నేడు శ్రీకాళహస్తి MLA బియ్యపు మధుసూదన్ రెడ్డి ,శ్రీకాళహస్తి పట్టణం,30వ వార్డ్ లో పర్యటిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకున్నారు.
స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి:
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ,గడపగడప కార్యక్రమం ద్వారా ప్రజలను నేరుగా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని,ప్రతి గడపకి జగనన్న సంక్షేమ పథకం ఏదో ఒక రూపంలో అందిందని ప్రజలందరూ జగనన్నను ఆశీర్వదించడం కోసం సిద్ధంగా ఉన్నారన్నారు.అలాగే గడప గడపకు వెళ్తున్నప్పుడు చిన్నపాటి సమస్యలను తెలియజేశారు వాటిని కూడా వెంటనే పరిష్కరించవలసిందిగా అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అన్నారు.పేద ప్రజల సంతోషం కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వారి కుటుంబాల్లో ఆనందాన్ని నింపిన జగనన్నకు మీ అందరి ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను అన్నారు.
ఈ కార్యక్రమంలో పాలకమండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు మరియు బోర్డ్ సభ్యులు, పట్టణ అధ్యక్షుడు పడాల రాజు,బుజ్జి రెడ్డి,అర్కాడు ముత్తు,శ్రీరాములు గౌడ్,తిరుకాల మల్లికార్జున్ గౌడ్,మధు,కార్తిక్, సాయి,మురళీ కృష్ణ,గణేశ్,కొల్లూరు హారి నాయుడు,చిలక గోపి,నాని,సిరాజ్, ఫజల్,సునీత సింగ్,సగిరా బీ,షర్మిలా టాగూర్, శ్రీవారి సురేష్, సెన్నిరు కప్పం శేఖర,శివ,బాబు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment