శ్రీకాళహస్తీశ్వర ఆలయంలోనీ పలుచోట్ల ఆలయ చైర్మన్ , ఈవో విస్తృత తనిఖీలు చేపట్టారు.
చైర్మన్ అంజూరు శ్రీనివాసులు, ఆలయ కార్యనిర్వహణాధికారి సాగర్ బాబు |
స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి:
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ఆలయంలో సోమవారం సందర్భంగా ఆలయంలో భక్తులతో కిటకిటలాడింది. వేసవి సెలవుల తో వివిధ ప్రాంతాల నుంచి ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. రాహు కేతు పూజ మండపాలు, దర్శనం క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడాయి. ఆలయ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు . ఆలయంలోని రాహు కేతు పూజ మండపాలు క్యూలైన్ల వద్ద చైర్మన్ శ్రీనివాసులు తనిఖీలు చేపట్టి ఎలాంటి టికెట్టు లేకుండా భక్తులను మోసగించి నేరుగా ఆలయంలో తీసుకెళ్తున్న దళారులను గుర్తించి తీవ్రంగా మందలించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ అంజూరు శ్రీనివాసులు, ఆలయ కార్యనిర్వహణాధికారి సాగర్ బాబు, ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు ప్రకాశం పంతులు, మున్నా రాయల్, ఆలయ డిప్యూటీ ఈవో ఎన్ ఆర్. కృష్ణారెడ్డి ఆలయ సిబ్బంది పాల్గొన్నారు
No comments:
Post a Comment