సమ్మర్ క్యాంప్ నగరి నియోజకవర్గ క్రీడా సంబరాలను ప్రారంభించిన మంత్రివర్యులు ఆర్కే రోజా
స్వర్ణముఖి న్యూస్,నగరి:
ఈరోజు నగరి డిగ్రీ కళాశాల మైదానం లో SAAP వారి ఆధీనం లో కల క్రీడా వికాస మైదానాలు మరియు భవనాలలో జరగున్న సమ్మర్ క్యాంప్ పోటీలను మన పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాల యువజన సర్వీసుల క్రీడా శాఖా మంత్రివర్యులు శ్రీమతి ఆర్కే రోజా గారు ప్రారంభించారు.
ఈ కార్యక్రమం లో నూతనంగా నిర్మించిన క్రికెట్ నెట్ ప్రాక్టీస్ కోర్టులను, వాలీబాల్, హ్యాండ్ బాల్, బాల్ బ్యాడ్మింటన్ మరియు ఆధునీకరించి న జిమ్, shuttle కోర్టులను చిత్తూరు జిల్లా కలెక్టరు హరినారాయణ గారి తో కలసి ప్రారంబించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ...
ఎమ్మేల్యే గా గెలుపొందిన నాటినుంచి గత 9 సంవత్సరాలుగా నియోజకవర్గం లోని యువత, విద్యార్థినీ విద్యార్థులను దృష్టి లో ఉంచుకొని మొదటి నుంచి కూడా ప్రతిసారీ ఏదో ఒక రకంగా గేమ్స్ అండ్ స్పోర్ట్స్ నిర్వహించడం జరుగుతుందని నగరి నియోజకవర్గం నుంచి బాల బాలికలు జాతీయ స్థాయి వరకు కూడా వీళ్ళు గెలుపొందిన సందర్భాలు ఉన్నాయని అంతే కాకుండా క్రీడల ద్వారా యువత, విద్యార్థులు శారీరకంగా మానసికంగా దృఢంగా వుంటారని, మానసిక స్థైర్యం ఏర్పడుతుందని, కులాలు, మతాలు కు సంబంధం లేకుండా అందరూ కలిసి కట్టుగా పాల్గొనే ఒకే ఒక్క ప్రధానమైన అంశం ఈ స్పోర్ట్స్ మాత్రమే అని తెలిపారు.
క్రీడలను ఆడడం ద్వారా ఆరోగ్యం,సంతోషం మాత్రమే కాకుండా మెడల్స్, అవార్డులు, ప్రైజస్ లాంటి గుర్తింపు పథకాలు కూడా లభిస్తుందని
ముఖ్యంగా జగన్ అన్న ముఖ్యమంత్రి అయిన తరువాత స్పోర్ట్స్ కోటా లో 2500 మంది ఉద్యోగాలు పొందారని,
మన రాష్ట్రం నుంచి అంతర్జాతీయ స్థాయి కి వెళ్ళిన క్రీడా కారులకు సుమారు 4.7 కోట్ల రూపాయలను వెచ్చించారు అని తెలిపారు.
అదేవిధంగా ప్రముఖ షటిల్ క్రీడాకారుడు స్పోర్ట్స్ అకాడమీ నిర్వహించడానికి 5 ఎకరాలు స్థలాన్ని మంజూరు చేశారని
చాలా మందికి జాబ్స్ కూడా ఇప్పించారు అని తెలిపారు.
చైర్మన్ గా బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి గారు మంత్రి గా నేను కూడా మా మీద పెట్టిన భాద్యతలను చక్కగా నెరవేర్చడానికి ప్రయత్నిస్తామని,
గ్రామీణ స్థాయిలో పిల్లలకు చక్కని ఆరోగ్యం కల్పించడానికి, ఎవరు బాగా గ్రామ స్థాయి లో ఆడుతారో వారిని గుర్తించి క్రీడాకారులు గా తీర్చిదిద్దడానికి ఇక్కడ ఉన్న ఫిజికల్ డైరెక్టర్లు ప్రతి సచివాలయం పరిధి లో ఉన్న బాల బాలిక క్రెడ్డ నైపుణ్యాలను గుర్తించి వారికి అవకాశాలు కల్పించడానికి తగిన కృషి చేయాలని తెలిపారు.
అలాగే నగరి ప్రజలు నన్ను సపోర్ట్ చేసి పంపారని ఇప్పుడు
రాష్ట్ర వ్యాప్తంగా గా మీకు సపోర్ట్ చేయడానికి నేను కృషి చేస్తానని తెలిపారు.
జగనన్న అధికారం లోకి వచ్చాక ఆడాలని ఉన్న ప్రతిఒక్కరికీ గ్రౌండ్ మరియు క్రీడా పరికరాలు వసతులను కల్పించారని, State wide 1769 summer camps జరుగుతున్నాయి అని తెలిపారు.
నగరి లో సుమారు 20 నుంచి 25 రోజుల వరకు ఈ సమ్మర్ క్యాంప్ జరుగుతుంది ఈ ఇరవై రోజులు మాత్రమే కాకుండా తరువాత కూడా ఛాంపియన్స్ కావాలనుకుంటే వారికి ఏడాది పూర్తిగా కూడా సరైన సహకారం ఉంటుందని, దీనికి ఫిజికల్ డైరెక్టర్లు సపోర్ట్ చెయ్యాలని,
ప్రజా ప్రతినిధులు అందరినీ కూడా ఉదయం మరియు సాయంత్రం వచ్చి పిల్లలను ఆడించడానికి ప్రోత్సాహం చేయాలని, అలాగే
శిక్షణపొందిన వారికి SAAP తరపున సర్టిఫికెట్స్ కూడా మంజూరు చేస్తారని తెలిపారు.
ఈ కార్యక్రమం లో చిత్తూరు జిల్లా కలెక్టరు గారితో బాటు జిల్లా క్రీడా శాఖా అధికారులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment