స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి:
తల్లి జ్ఞానప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరుడు కొలువైఉన్న దక్షిణ కైలాసమైన శ్రీకాళహస్తి నందు రాహు- కేతు సర్ప దోష నివారణ ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్నది. అటువంటి సర్పదోష నివారణ దేవాలయమైన శ్రీ కాళహస్తి దేవాలయమునకు సుమారు 9 లక్షల రూపాయలు విలువ చేసే వెండితో తయారు చేయబడిన రాహువు నాగ పడిగను మరియు కేతువు నాగ పడిగను విశాఖపట్నమునకు చెందిన CMR సంస్థల అధినేత శ్రీ మావూరి వెంకట రమణ గారు, వారి శ్రీమతి పద్మ,వారి కుమారుడు , మోహన్ బాలాజీ, వారి శ్రీమతి హేమా నిహారిక,వారి పుత్రిక మావూరి మానస గారి పేరిట శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ అంజూరు తారక శ్రీనివాసులు గారికి మరియు ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ సాగర్ బాబు గార్లకు అందజేయడం జరిగినది. తదనంతరం వారికి చైర్మన్ అంజూరు శ్రీనివాసులు గారు ఆలయ సిబ్బందితో రాహు కేతు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి, స్వామి అమ్మవార్ల ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి వేదపండితుల చేత మంత్రోచ్ఛారణలతో ఆశీర్వాదాలు అందించి కండువాలు కప్పి తీర్థప్రసాదాలు అందజేసి, దోష నివారణ చేసే రాహుకేతువులను అందజేసిన CMR సంస్థ వారికి వారి కుటుంబానికి ఏ దోషాలు లేకుండా వ్యాపారాభివృద్ధి జరగాలని, తల్లి జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ వాయు లింగేశ్వరుని యొక్క చల్లని ఆశీస్సులు ఎల్లప్పుడూ తోడుండాలని ఆ దేవదేవుని ప్రార్థిస్తున్నాను అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, ఆలయ అధికారులు హరి, , మరియు అధికారులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment