కౌలు రైతు బాస్కరయ్య కుటుంబానికి బొజ్జల సుధీర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ తరుపున 50,000/- ఆర్థిక సహాయం - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, May 25, 2022

కౌలు రైతు బాస్కరయ్య కుటుంబానికి బొజ్జల సుధీర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ తరుపున 50,000/- ఆర్థిక సహాయం

 కౌలు రైతు కీ శే A.బాస్కరయ్య  కుటుంబానికి బొజ్జల సుధీర్ రెడ్డి   పరామర్శ 




స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి: 

నిన్న శ్రీకాళహస్తి మండలం ముచ్చువోలు గ్రామంలో కౌలు రైతు బాస్కరయ్య  ఆత్మహత్య చేసుకొని చనిపోయారు వారి కుటుంబాన్ని తిరుపతి పార్లమెంట్ రైతు నాయకులతో కలిసి వారి కుటుంబాన్ని పరామర్శించిన శ్రీకాళహస్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జి బొజ్జల సుధీర్ రెడ్డి 

బొజ్జల కుటుంబం పుట్టెడు శోకంలో ఉన్న కూడా  బాస్కరయ్య మరణ వార్త తెలుసుకుని వారికి సహాయం చేయడానికి వారి ఇంటికి వెళ్లిన బొజ్జల సుధీర్ రెడ్డి  

తిరుపతి పార్లమెంట్ రైతు విభాగం నాయకుల ఆధ్వర్యంలో బొజ్జల సుధీర్ రెడ్డి   బాస్కరయ్య భార్య  నారాయణమ్మ  తెలుగుదేశం పార్టీ తరుపున 50,000/- ఆర్థిక సహాయం చేసారు, ఎ సమస్య వచ్చిన ఆ కుటుంబనికి నేను అండగా ఉంటానని తెలిపారు 

బొజ్జల సుధీర్ రెడ్డి   మాట్లాడుతూ ఈ ప్రభుత్వంలో రైతులు బతికే పరిస్థితి లేదన్నారు ఎరువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి, ఒడ్లు చూస్తే ప్రభుత్వం కోనేపరిస్థితి లేదన్నారు, ఈ రైతు మరణంతో అయిన ప్రభుత్వం కళ్ళు తెరవాలన్నారు వెంటనే ఈ కుటుంబాన్ని 25 లక్షలు ఎక్సగ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు 

రైతు అధ్యక్షులు రాధాకృష్ణమ నాయుడు  మాట్లాడుతూ పుట్టి వడ్లు 18000 ఉంటె ఈ ప్రభుత్వం 16000 లకు కొంటుందన్నారు, ధాన్యం కొనుగోలు చేసిన 60 రోజులకి కూడా ట్రక్ షీట్లు ఇచ్చే పరిస్థితి లేదన్నారు ఈ ప్రభుత్వంలో రైతులు బ్రతికే పరిస్థితి లేదని ఏద్దెవాచేసారు

ఈ కార్యక్రమంలో  తిరుపతి పార్లమెంట్ రైతు అధ్యక్షులు రాధాకృష్ణమ నాయుడు,  రైతు ప్రధాన కార్యదర్శి గోపినాథ్ రెడ్డి, మండల అధ్యక్షులు కామేష్ యాదవ్, రైతు ఉపాధ్యక్షులు ప్రకాష్ నాయుడు, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ చెంచయ్య నాయుడు,మాజీ డీసీసీబీ చైర్మన్ రవీంద్రనాథ్ రెడ్డి,మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ రామాంజులు నాయుడు,బిసి సెల్ స్టేట్ ఆర్గనిగింగ్ సెక్రటరీ సుధాకర్,శేఖర్ నాయుడు, మాజీ సర్పంచ్ సురేష్ రెడ్డి, హరి, బాలాజి, నరసయ్య,వెంకటకృష్ణయ్య,  మురళీ మోహన్ రెడ్డి, గురునాద్ రెడ్డి, మురళి, హరిప్రసాద్, సుబ్రహ్మణ్యం, మురళి. B, మల్లికార్జున గ్రామస్తులు మరియు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad