ఫోర్త్ వేవ్ పై ముందస్తు సమీక్ష - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, May 10, 2022

ఫోర్త్ వేవ్ పై ముందస్తు సమీక్ష

 ఫోర్త్ వేవ్ పై ముందస్తు సమీక్ష 



స్వర్ణముఖి న్యూస్, తిరుపతి:


ఫోర్త్ వేవ్ రాకూడని కోరుకుందాం .


గతంలో జరిగిన పొరపాట్లు భవిష్యత్ లో రాకూడదు .


ఒక్క మరణం కూడా జరగకుండా ప్రణాళిక సిద్ధం కావలి ... జిల్లా కలెక్టర్ కె వెంకటరమణా రెడ్డి 


కలెక్టర్ ఛాంబర్లో మంగళవారం రాత్రి జెసి బాలాజీ తో కలసి మెడికల్ అధికారులతో సమీక్ష 


జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 134 నెట్ వర్క్ ఆసుపత్రులు 5 లక్షల 90 వేలు వున్నాయి పేదలకు ఖఛ్చితంగా వైద్యసేవలు ఉచితంగా అందాలని కోవిడ్ పాండమిక్ లో పిర్యాదులు ఎక్కువ రాకుండా చూడాలని ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ రాజశేఖర్ రెడ్డి కి సూచించారు.


అవసరమైన మందులు , స్టాక్ గుర్తించి వివరాలు ఎ పి ఎం ఐ డి సి , ఇఇ ధనంజయ రెడ్డి ని ఆదేశించారు.


జిల్లాలో 3 వేల బెడ్లు ప్రవేట్ , ప్రభుత్వ ఆసుపత్రి లో  ఐసియు , ఆక్సిజన్ , కామన్ బెడ్స్ అందుబాటులో వున్నాయి. గతంలో కోవిడ్ కేర్ సెంట్రర్లు 9 వున్నాయి , ఇప్పుడు 8 అందుబాటులో ఉంటాయి , వీటిపై పెద్ద అవసరం ఉందని అయినా అవసరం అయిన యెడల సిద్ధం ఉండాలి అన్నారు.  శాంపిల్స్ సేకరణ కు ల్యాబ్ కు చేరే వాహనాల పరిస్థితి పై సమీక్ష నిర్వహించారు.


స్విమ్స్ , రుయా , ప్రవేట్ ల్యాబ్ వివరాలు ఉండాలి , ఫీవర సర్వే ప్రతిరోజూ రిపోర్ట్ ఇవ్వాలి డి ఎం హెచ్ ఓ శ్రీహరిని ఆదేశించారు.


వాక్సినేషన్  60+ పూర్తయి ఉండాలి . పెండింగ్ ఉంటే పూర్తి కావాలని అన్నారు. డి ఐ ఓ దృష్టి పెట్టాలి అన్నారు. 


ఫివర్ సర్వే , వాక్సినేషన్ , టెస్టింగ్ వివరాలు ఏరోజుకారోజు అప్ డేట్ ఉండాలని సూచించారు.


పూర్తి సమాచారంతో రెండురోజుల్లో హాజరు కావాలని అన్నారు. 


ప్రస్తుత ఫోర్త్ వేవ్ ప్రక్కరాష్టాల్లో పరిస్థితి , మరణాలపై  వైద్య అధికారులు పూర్తి డేటా వెంటనే సేకరించండి.


అప్పుడే మనం మరింత జాగ్రత్త పడి సేవలందించ గలం . 


స్విమ్స్ సూపరింటెండ్ డా.రామ్ , డా.సుబ్బారావు , డా.వాణి , ప్రొఫెసర్లు హాజరయ్యారు 

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad