తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతరకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, May 10, 2022

తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతరకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు

 తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతరకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు







స్వర్ణముఖి న్యూస్, తిరుపతి:

తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతర నేపధ్యంలో ఏర్పాట్లను పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ శ్రీ పరమేశ్వర రెడ్డి ఐ.పి. యస్.
ఆలయ పరిసర ప్రాంగణము, క్యూ లైన్లు, పొంగళ్ళు పెట్టు ప్రాంతం, ఇందిరా ప్రియదర్శిని మార్కెట్, తూడా మైదానము, పార్కింగ్ ప్రాంతాలను భద్రతా పరమైన అంశాలపై అరా తీశారు.
జాతరపై ప్రత్యేక దృష్టి సారించి ఎలాంటి ఘటనలు జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
ఆలయ ప్రాంగణములోనే పోలీస్ కమాండ్ కంట్రోల్ ఏర్పాటు.
ఆలయంలో పాటు పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు, బాడీ వార్న్ కెమెరాల తో నిరంతర పర్యవేక్షణ.
జాతర మొదటి రోజు నుండి 100 మంది పోలీస్ సిబ్బందితో పటిష్ఠ భద్రత కల్పిస్తూ ఆకరి రోజు నాడు 300 మంది పోలీస్ సిబ్బందితో భద్రత ఏర్పాట్లు చేస్తాం.
జాతర ముసుగులో మద్యం సేవించి అసభ్యకరంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.
అక్రమ వసూల్లకు పాల్పడితే కేసు నమోదు.
జిల్లా యస్.పి శ్రీ పరమేశ్వర రెడ్డి, ఐ.పి.యస్.
తిరుపతి తాతయ్యా గుంట గంగ జాతర సందర్భంగా పటిష్టమైన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయనున్నట్లు తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ.పి. పరమేశ్వర్ రెడ్డి ఐ.పి.యస్ గారు తెలిపారు.
కరోనా నిబంధనల కారణంగా గత రెండు సంవత్సరాలుగా తాతయ్యగుంట గంగమ్మ అమ్మవారికి జాతర నిర్వహించలేక పోయారు.
జిల్లాలోనే కాక పరిసర జిల్లాలకు కూడా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే తాతయ్యా గుంట గంగమ్మ అమ్మవారి జాతర, ఈ ఏడాది పెద్ద ఎత్తున నిర్వహించడానికి ప్రజాప్రతినిధులు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో జాతర సందర్భంగా అమ్మవారి ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువ సంఖ్యలో ఉంటుందన్న అధికారుల అంచనాలకు, అనుగుణంగా భారీ స్థాయిలో బందోబస్తును ఏర్పాటు చేయనున్నట్లు వారు తెలిపారు.
దొంగతనాల అరికట్టేందుకు ప్రత్యెక చర్య:-
జాతర సందర్భంగా భక్తుల రద్దీ ఎక్కువగా వుండటంతో చైన్ స్నాచింగ్, జేబు దొంగతనాలు వంటివి పాల్పడే వ్యక్తులు ఇది ఒక అవకాశంగా తీసుకుని, భక్తుల విలువైన సొమ్ములను దోచుకునేందుకు అవకాశంగా భావిస్తారు కావున ఆలయ పరిసర ప్రాంతాల్లోనే కాక బస్టాండ్ ఇతరత్రా రద్దీ ప్రాంతాలలో రోడ్ల వెంట పోలీసు పహారా పికెట్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
చిన్నపిల్లల భద్రత దృష్ట్యా:-
జాతర సందర్భంగా పిల్లలతో ఆలయానికి వచ్చే తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని, పసిపిల్లలు తప్పి పోవడం, ఇతరత్ర నేరాలు జరగకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
తోపులాటలు ఒక్క అవకాశం లేదు:-
ఆలయ పరిసరాల్లో మరియు ఆలయం లోపల దర్శనానికి వెళ్లే సమయంలో భక్తులు తోపులాటకు అవకాశం లేకుండా అడుగడుగునా పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేసి తొక్కిసలాటలో ఇతరత్రా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
వేషధారణలో వసూల్లు తగ్గవు:-
జాతర సందర్భంగా అమ్మవారికి మొక్కులు తీర్చుకునేందుకు రకరకాల వేషధారణలో భక్తులు ఆలయానికి వస్తారు. అయితే కొందరు వేషధారణ ముసుగులో మహిళలను బెదిరించి కాసులు వసూలు చేసుకోవడం తగదని, అటువంటి వారిపై పోలీసులు నిఘా ఉంచుతారని వారిపై చర్యలు తీసుకోబడును అని హెచ్చరించారు.
ట్రాఫిక్ నియంత్రణ దిశగా:-
అమ్మవారి ఆలయానికి పరిసరప్రాంతాలలో ఆలయానికి చేరుకునే మార్గాలు నన్నిటిని బ్యారికేడ్ లతో అడ్డుకట్ట వేయ పడుతుందని వాహనాలను అనుమతించబడవు అని తెలిపారు. ఆలయ పరిసర ప్రాంతాలలో రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున వాహనాలను ఆలయం నుంచి దాదాపు 500 మీటర్ల దూరంలోనే అన్ని వైపులా ఆపివేయడం జరుగుతుందని తెలిపారు.ఇందుకు సంబంధించి ట్రాఫిక్ పోలీసుల ద్వారా అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
అసభ్య ప్రవర్తన వీడండి:-
జాతర ముసుగులో ఆకతాయిలు మహిళల పట్ల యువతుల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు పోలీసుల దృష్టికి వస్తే వారిని ఉపేక్షించేది లేదని వారిపై వెంటనే హెచ్చరించారు. ముఖ్యంగా యువకులు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులకు కనబడితే వెంటనే అరెస్టు చేయడం జరుగుతుందని తెలిపారు.
సాంస్కృతిక వేదిక వద్ద కట్టుదిట్టం:-
ఈ ఏడాది జాతరలో రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో 6 రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో తుడా మైదానంలో లో అమ్మవారి ఆలయానికి వచ్చే భక్తులు స్థానికులు జాతర సంబరాలు పోలీసు పహారా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
అనుమానితుల కు సంబంధించి:-
జాతర గుంపులో ఎవరైనా అనుమానితులు ఉన్నట్లు ప్రజలు గుర్తిస్తే వెంటనే డయల్ 100 కు గాని, సమీపంలోని పోలీసు గాని తెలియజేయాలని సూచించారు.
మత్తులో దౌర్జన్యాలకు దిగకండి:-
యువకులు, పురుషులు జాతర సందర్భంగా మద్యం సేవించి ఈ ఆలయానికి వచ్చే మహిళల పట్ల ఇతరుల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు తెలిస్తే చర్యలు తప్పవన్నారు.
పోలీసులకు సూచన:-
ఏడు రోజులపాటు అట్టహాసంగా జరగబోయే జాతర సందర్భంగా విధులు నిర్వహించే పోలీసులు అప్రమత్తంగా ఉంటూ, అసాంఘిక కార్యక్రమాలకు దొంగతనాలకు అరాచకాలకు పాల్పడే వ్యక్తుల పట్ల కఠినంగా వ్యవహరించి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఈస్ట్ డిఎస్పీ మురళీకృష్ణ, సిఐ శివప్రసాద్, ఆలయ చైర్మన్ కట్టా గోపి యాదవ్, ఈ.ఓ ముని కృష్ణ, యస్.ఐ ప్రకాష్ కుమార్ లు పాల్గొన్నారు

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad