విజేత జట్టుకు రూ.లక్ష బహూకరించిన ఎస్ఎస్ఆర్
స్వర్ణముఖి న్యూస్, తిరుపతి:
శ్రీకాళహస్తికి చెందిన ఉమ్మడి చిత్తూరు జిల్లా టెన్నిస్ బాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు సంఘ సేవకులు సామాను శ్రీధర్ రెడ్డి (ఎస్ఎస్ఆర్) క్రీడల పట్ల తనకున్న ఆసక్తిని మరోసారి చాటుకున్నారు. విజేత జట్టుకు ముందుగా ప్రకటించిన విధంగా రూ.లక్ష అందచేశారు. తిరుపతి నగరంలోని తారకరామ స్టేడియంలో ఎవాల్వ్ క్రికెట్ టోర్నమెంటు పది రోజుల పాటు నిర్వహించారు. ఈ టోర్నమెంటుకు సంబంధించి గురువారం ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఒక్కో జట్టు పది ఓవర్లు ఆడారు. ఇందులో విజేతగా చోటా లెవెన్ జట్టు నిలిచింది. రన్నర్ గా ఎల్ బాయ్స్ జట్టు నిలిచింది. విజేతగా నిలిచిన చోటా లెవెన్ జట్టుకు సామాను శ్రీధర్ రెడ్డి ట్రోఫీతో పాటు రూ.లక్ష నగదు బహుమతి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... యువతకు క్రీడల పట్ల ఆసక్తి పెంచడమే తన లక్ష్యమన్నారు. జిల్లాలో ఎక్కడ క్రీడలు జరిగినా ప్రోత్సహిస్తానని చెప్పారు. యువత చదువుతో పాటు క్రీడల ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. తాను ఇప్పటికే పలు చోట్ల క్రికెట్ టోర్నమెంట్లు నిర్వహించి బహుమతులు అందచేసినట్లు ఈ సందర్భంగా ఎస్ ఎస్ ఆర్ గుర్తు చేశారు. భవిష్యత్తులో కూడా క్రీడలను ప్రోత్సహిస్తానని తెలిపారు. విజేతగా నిలిచిన జట్టు సభ్యులు అసోసియేషన్ సభ్యులు క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న ఎస్ ఎస్ ఆర్ ను శాలువాతో ఘనంగా సత్కరించి జ్ఞాపికను బహూకరించారు.
No comments:
Post a Comment