చిన్న కొట్టాయం ఉత్సవాలు
స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి:
దక్షిణ కైలాసంగా పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవాలయం లో అలంకార మండపం వద్ద సోమస్కందమూర్తి అమ్మవారు జ్ఞాన ప్రసూనాంబ ఉత్సవమూర్తులను మంగళవాయిద్యాలతో మేళతాళాలతో అలంకారం నుంచి బయలుదేరి ఆలయ ఆవరణంలో పగడాల చెట్టు కింద స్వామి అమ్మవారు చేరుకొని ప్రారంభమైన స్వామి అమ్మవారికి విశేష అభిషేకాలు పాలు పెరుగు తేనె గంధము సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేసి స్వామి అమ్మవారిని చక్కగా వివిధ రకాల పుష్పాలతో ఆభరణాలతో రమణీయం గా అలంకరించి దీప ధూప నైవేద్యం అఖండ దీపారాధన స్వామి అమ్మవారికి నీరాజన హారతులు పట్టారు ఈ కార్యక్రమానికి దేవస్థాన పాలక మండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు గారు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు.
No comments:
Post a Comment