కార్మిక చట్టం పై అవగాహనా కల్పించిన న్యాయవాదులు
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి
ఈరోజు న్యాయ విజ్ఞాన సదస్సులో భాగంగా శ్రీకాళహస్తి పట్టణంలోని కైకాల సత్రం నందు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమములో బాలకార్మికుల నిషేధ చట్టం 1986 కింద ప్రముఖ వ్యాపార వేత్త లతో లేబర్ ఆఫీసర్ రంగనాధ్ గారి ఆధ్వర్యంలో వస్త్ర వ్యాపారవేత్తల గౌరవ అధ్యక్షులు ఊటుకూరు రమేష్ బాబు , లీగల్ ఎయిడ్ కౌన్సిల్ రాజేశ్వరరావు,న్యాయవాదులు ప్రజ్ఞశ్రీ, అరుణ్ కుమార్ మరియుఈ పార లీగల్ వాలంటీర్స్ బాబా ఫరీద్, తేజ ,వస్త్ర వ్యాపార సంఘ సభ్యులు పాల్గొన్నారు.
లేబర్ ఆఫీసర్ రంగనాధ్ మాట్లాడుతూ.... మీ మీ దుకాణాలలో చిన్న పిల్లలను పనిలో పెట్టుకుంటే కఠినమైన శిక్షలు వుంటాయని, అలాగే వారి లైసెన్స్ లు రద్దవుతాయని అన్నారు.
న్యాయవాదులు మాట్లాడుతూ....కార్మిక చట్టం పై అవగాహనా కల్పించారు. అలాగే కార్మిక చట్టం లోని న్యాయపరమైన సలహాలు సూచనలు అందించారు. న్యాయపరమైన సలహాలు ఉచితముగా 15100 కాల్ చేయండి అన్నారు.
No comments:
Post a Comment