రజకుల చాకలి మాన్యం భూములను ఇప్పించాలంటూ కలెక్టర్ వెంకటరమణారెడ్డికు వినతి
స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి:
శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలం తొట్టంబేడు గ్రామానికి చెందిన చాకలి మాన్యం భూమిని తొట్టంబేడు మండల కార్యాలయములోని ఓ అధికారి రజకులకు సంబంధించిన సర్వే నెంబర్ 77 లోని 14b రజకుల భూమిని తన ఆధీనంలోకి తీసుకోని రాజకీయ నాయకుల అండదండలతో చెలామణి చేస్తున్నాడు అతని నుండి రజకుల భూమికి విముక్తి కల్పించి రజకులకు ఇప్పించాలని సవినయంగా కోరుతూన్నాము. ఫిబ్రవరి 23 వ తేదీన అప్పటి తొట్టంబేడు తాసిల్దార్ పరమేశ్వర్ రావు గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కానీ స్పందన మాత్రం లేదు శ్రీకాళహస్తి నియోజకవర్గం లోని రజకులు బట్టలు ఉతుక్కోవడానికి గుంటలనూ, కాలువలను వెతుక్కోని ప్రాణాలమీదికి తెచ్చుకొనే దుస్థితి ఏర్పడుతుంది. అంతరించిపోతున్న తమ తరతరాల వృత్తిని కాపాడాలని కోరుకుంటు మా భూమిని మాకు ఇప్పించవలసిందిగా కోరుచున్నాము.ఈ కార్యక్రమంలో ఈ సందర్భంగా రాష్ట్ర రజక ఫెడరేషన్ చైర్మన్ మీసాల రంగయ్య, రజక సంఘం నాయకులు,యశోద అవరంబేటీ జయశ్యాం, నాయకులు పాకాల రమేష్, సంజాకులమురళి, సంజకుల సుబ్రహ్మణ్యం, దొడ్డరం మురళి. తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment